
ఘనంగా వైసీపీ జెండా పండుగ…
పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్జగన్
విలువలు…విశ్వసనీయతతో నడుస్తా
కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పండి...
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జగన్

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ అధినేత నివాసమైన తాడేపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి జగన్ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోనే వెసీపీ అన్నది ఒక మార్క్. దేశ రాజకీయాలల్లో ప్రభలంగా కనిపిస్తున్న మార్క్. వైసీపీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అన్నది మీకు తెలుసు. ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది… ఒక్కమాట రాష్ట్ర రాజకీయాలను మార్చింది. విలువలు, విశ్వసనీయత అన్నపదాలకు అర్ధం చెబుతూ పుట్టింది వైసీపీ. వైసీపీ అన్నది జగన్ అనే నా ఒక్క జగన్‌ది కాదు. కోట్ల మంది కార్యకర్తలు, అభిమానులది వైసీపీ అని అన్నారు జగన్… జగన్ ఒక్కడిగా ఉన్నా ఏ నాడూ భయపడలేదు. కుట్రలు, కుతంత్రాల మధ్య తెలుగుదేశం`కాంగ్రెస్‌పార్టీ పన్నిన కుట్రలు మనం చూశామన్నారు జగన్. పైన దేవుడు కింద మిమ్మల్ని నేను నమ్ముకున్నాను. నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కాలర్ ఎగరేసుకొని అడుగో మా నాయకుడు అని గర్వంగా చెప్పుకొనేలా చేస్తా. మీ ప్రేమాభిమానాలకు రుణపడిఉంటానన్నారు జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్సార్‌ని ప్రేమించే గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏదేశంలో ఉన్నా వారికి వినమ్రంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు జగన్.