
వైసీపీకి 11 సీట్లే..కానీ 1100 మందిలాగా…
రెండేళ్ళకు చేరువలో కూటమిపాలన
చంద్రబాబు గేర్ మార్చక తప్పదా?
“వైసీపీ వాళ్ళకు ఉన్నది 11 సీట్లే కానీ వాళ్ళు 1100 మంది అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా గట్టిగా చెప్తారు…మనం మాత్రం అలా చేయటం లేదు” – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చాలా అరుదు. ఎందుకంటే రాజకీయ నాయకులు తమ మనస్సులో ఏమిఉన్నా పైకి గుంభణంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు మొహంలో ఎప్పుడూ అంతరంగంలో ఏముందో కనిపెట్టడం చాలా కష్టం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నం. తన మనస్సు ఏం చెప్తుందో అదే మాట్లాడటం పవన్ నైజం. కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది అని చెప్పినా, కార్యకర్తలు కూటమి ధర్మాన్ని పాటించి తీరాల్సిందే అనే హుకుం జారీ చేసినా పవన్ స్టైల్ వేరు. పవన్ కళ్యాణ్‌కి కార్యకర్తల మనస్సు గెలిచిన నాయకుడు. ఎక్కడ తగ్గాలో తెలుసు…ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు పవన్‌కి. అందుకే గతంలో రెండు అసెంబ్లీ సీట్లలో ఓడినా బెదరలేదు. నన్ను నమ్మండి నేను చూసుకుంటా… అని కార్యకర్తలకు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో తానేంటో చూపించారు. 100 స్ట్రైక్‌రేట్…కొట్టారు. కార్యకర్తలు నాయకులు 50 సీట్లు కావాలని కోరుకుంటే కేవలం 21 సీట్లు తీసుకున్నారు పవన్. తీసుకున్న సీట్లన్నీ గెలిపించారు. 50 తీసుకొని 29 ఓడిపోయి 21 గెలిచి ఉంటే ఏమౌతుందో పవన్‌కి తెలుసు. అందుకే ఎంత కావాలో అంతే తీసుకుంటాడు.

అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే మీరు అరవటమే కానీ మనకు సీఎం అయ్యేందుకు అవసరమైన బలం లేదు కదా? అని నేరుగానే చెప్పగలిగే నాయకుడు పవన్.
పరిస్థితులకు తగ్గట్లుగా వెళ్ళాల్సిందే అని నమ్మిన నాయకుడు పవన్. అందుకే కూటమిలో కీలక భాగస్వామిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కేంద్ర బిందువు. పవన్ లేనిదే మొన్నటి ఎన్నికల్లో కూటమి లేదు అన్నది జగమెరిగిన సత్యం. నేరుగా ఇదే మాట పబ్లిక్‌గా చెప్పగలిగే గట్స్ ఉన్న నాయకుడు పవన్.
ఇప్పుడు అసెంబ్లీలో వపన్ కళ్యాణ్ మాట్లాడిన వైసీపీ వాళ్ళకు 11 సీట్లు వచ్చినా వాళ్ళు మాత్రం 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతటి ధైర్యం వాళ్లకు ఉంది…వాళ్ళు నమ్మింది బలంగా ప్రజలకు చెప్తున్నారు అని చెప్పటం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది.
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడుస్తున్నందున ప్రతిపక్షం కాస్త యాక్టివ్ రోల్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ కూడా అంబటి, జోగి అరెస్టుతో కాస్త దూకుడు పెంచింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలోనూ వైసీపీ సోషల్ మీడియా అధికార పార్టీ తీరుపై విస్తతంగా ప్రచారం చేస్తోంది. బలం తక్కువున్న ప్రతిపక్షం మీడియా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అధికారంలో ఉండి, కూటమిగా ఉండి, వారికంటే పదిరెట్లు బలమున్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీ విమర్శలను ఎందుకు తిప్పికొట్టడం లేదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే తాను అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబు సమక్షంలోనే కుండబద్దలు కొట్టి మరీ మీరు యాక్టివ్ అవ్వాలి అని కూటమి ఎమ్మెల్యేలకు సంకేతాలిచ్చారు.
పవన్ కళ్యాణ్ మాటలపై చంద్రబాబు కూడా దష్టి సారించినట్లు సమాచారం. అసెంబ్లీ అయ్యాక ఫోన్లో “ఐ అగ్రీవిత్ యూ” పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు చెప్పినట్లుగా తెలిసింది. అయితే మనం ఏం చేద్దాం… మన వాళ్ళు మరింత దూకుడు పెంచాలి. వైసీపీ పుంజుకోకుండా చూడాలి అని చంద్రబాబు చెప్పగా మనం గేరు మార్చాల్సిందే సర్, తప్పు తప్పు అని పదే పదే చెప్పటం ద్వారా వైసీపీ ఒప్పును కూడా తప్పుగా చూపుతోంది. మన ఇక అశ్రద్ధ చేయొద్దు అని చంద్రబాబుకు పవన్ సూచించినట్లుగా సమాచారం.
ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత పవన్ సూచించిన అంశాన్ని టెలీ కాన్ఫరెన్స్ లేదా, పార్టీ అధికారిక ఆదేశాల రూపంలో కూటమి ఎమ్మెల్యేలను యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.