
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జగన్ ను ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ… సార్ చంద్రబాబు నాయుడు ఉపప్రదానమంత్రి గా వెళుతున్నారంట అని ప్రశ్నించగా… చంద్రబాబు ఉప ప్రధానమంత్రి గానా..? రాష్ట్ర ప్రజలే చంద్రబాబు నాయుడును భరించలేకపోతున్నారు… ఇక దేశ ప్రజలు ఎలా భరిస్తారు స్వామీ .. అంటూ సీఎం చంద్రబాబుపై జరుగుతున్న ప్రచారాన్ని ఘాటుగా తిప్పి కొట్టారు జగన్.
రిపోర్టర్లు చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించడం… జగన్ తన దైనశైలిలో స్పందించడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.