
సీఎం కూర్చి లో డీకే శివకుమార్…?
కర్ణాటకలో కుర్చీలాటకు ముగింపు పలికే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం…?
అధిష్టానాన్ని కలిసి… సీఎం సీటు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన డీకే…
ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ భేటీ పై సర్వత్ర ఆసక్తి...
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట బసవత్తరంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు కిందకు ఇప్పటికే నీళ్లు వచ్చినట్లు డీకే శివకుమార్ మాటల ద్వారా స్పష్టమవుతుంది. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని, తన వల్లే కర్ణాటకలో పార్టీ గెలిచింది అన్నది డీకే శివకుమార్ వాదన. మరోవైపు సిద్ధరామయ్య సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని సీఎం పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పైకి ఇరువురు నేతలు బాగానే..లో లోపల సీటు కోసం డీకే శివకుమార్, సీఎం గూర్చి కాపాడుకునేందుకు సిద్ధరామయ్య గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నాన్సుడి ద్వారానే ఆ పార్టీకి మరింత చేటు చేసేలా కనిపిస్తోంది. ఇరువర్గాలు బాహాబాహీ కి దిగి, పరస్పర ఘాటు విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును రోడ్డు కీడుస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నాయి. సీఎం సీటు మార్పు తప్పదంటూ డీకే వర్గం సంకేతాలు ఇస్తుంది.
అవకాశం ఇవ్వండి అంటున్న డీకే...
ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది.
ఇదే డిమాండ్‌తో గత కొన్ని వారాలుగా హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన హఠాత్తుగా
హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాందీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన
సాగించారు. రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేల ఆరోపణలు చేసుకుంటున్నారు.
హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల-వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్ కే సలహాలు ఇవ్వడం గమనార్హం. డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన
భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది. కాగా ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్
అన్నారు.