
తమిళనాడు నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు షణ్ముగం మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాష్ట్రలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం శాంతిభద్రతలు పరిరక్షించడంలో విఫలం చెందిందని బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా సివి షణ్ముగం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం టెల్ యువర్ డ్రీమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని… ఏమి కావాలన్నా ఇస్తారా… అయితే నాకు నయనతార కావాలి ఇస్తారా అని షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేకెత్తి రేపుతున్నాయి.
గతంలోనూ సివి షణ్ముఖం చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి…
గతంలో మహిళలను ఉచిత ప్రభుత్వ పథకాలతో పోల్చిన షణ్ముగం… స్టాలిన్ ఉచితంగా పథకాలు ఇస్తున్నారని… ఉచితంగా భార్యలను కూడా ఇస్తారా అని వ్యాఖ్యానించి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎన్నికల కోసం చాలా ప్రకటనలు చేస్తున్నారని… ఉచితంగా మిక్సర్లు ఆవులు మేకలు ఇస్తామని చెప్తున్నారు అని… ప్రతి వ్యక్తికి ఉచితంగా ఒక భార్యని కూడా ఇవ్వవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్టాలిన్ ని ఉద్దేశించి చేసినవి. గతంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాజాగా షణ్ముఖం చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ అటు రాజకీయ రంగంలోనూ తీవ్ర విమర్శలకు దారి తీసాయి. సివిషణ్ముగం ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యుడి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రతిపక్షాలు, ఆ రాష్ట్ర మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.