
ముగిసిన చీఫ్ విప్ జీవీ విదేశీ పర్యటన
– ఘన వీడ్కోలు పలికిన ఎన్.ఆర్. ఐ విభాగం
వినుకొండ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా క్రైస్ట్‌చర్చ్‌లో జి.వి. ఆంజనేయులు ఆయన కుటుంబ సభ్యులను ఎన్నారై వింగ్ ప్రెసిడెంట్ నల్లదిమ్ము కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా వీడ్కోలు పలికారు. విదేశీ పర్యాటనలో జీవీ తో పాటు ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్, కోడలు సత్య హరీష్, మనవడు ఆర్య వీర్ పాల్గొన్నారు. వీడ్కోలుకు ముందు ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందులో ప్రవాసాంధ్రులు నేత దంపతులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇదే వేదికపై జి.వి. ఆంజనేయులు కుమారుడు హరీష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం హోటల్ నుంచి విమానాశ్రయం వరకు 50కి పైగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రవాసాంధ్రులు, తమ అభిమాన నేతకు ఘనమైన సెండాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జి.వి. ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన గురించి వివరిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నారైలకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీకాంత్ మరియు కరుణాకర్‌లకు నల్లదిమ్ము కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో తమను కలిసినందుకు పల్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వ పాలనను ప్రశంసించారు.