
ఐపీఎల్ ధూం…ధాం…కి సర్వం సిద్ధంత్వరలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు
2026 ఐపీఎల్ తొలి షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
ఓ వైపు మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనుండటంతో దేశంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సెలబ్రేషన్స్ ముగిసిన వెంటనే మరోవైపు ఐపీఎల్`19 నిర్వహణకు సన్నద్ధమైంది. ఈ ఏడాది నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల తొలి విడత షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

మార్చి 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్`19 సీజన్ టోర్నీకి సంబంధించి తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్ హైదరాబాద్ బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో ఢీకొంటుంది. తర్వాతి రోజు వాంఖడేలో ముంబయి, కోల్‌కతా తలపడతాయి. ఏప్రిల్ 4, 5, 11, 12 తేదీల్లో రెండు చొప్పున మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుత షెడ్యూల్లో మ్యాచ్‌లు ఏప్రిల్ 12తో ముగియనున్నాయి.
మూడు రాష్ట్రాల ఎన్నికలకు వేళాయె…

ఈఏడాది వేసివిలోనే తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల తేదీలు ఖరారైతే, ఎన్నికల తేదీలను పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ మిగతా షెడ్యూల్‌ను ప్రకటించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. తొలి 20 మ్యాచ్‌లు 10 వేదికల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 5న ఉప్పల్‌లో సన్‌రైజర్స్, లఖ్‌నవూ తలపడతాయి. కాగా బెంగులూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై కొంత సందిగ్ధం నెలకొంది. గత ఏడాది ఆర్సీబీ కప్పు గెలిచిన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో ఈ మైదానంలో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.