
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామా నగర్ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిరసన ఫలించింది. పాఠశాలలో తమకు భోజనం బాగోలేదని, తినలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేయటమే కాక పాఠశాలలో వడ్డించిన భోజనాన్ని కుడితి బకెట్లో పడవేసి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ 100 నంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలలోకి రంగ ప్రవేశం చేశారు. పిల్లలతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు పోలీసులు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. అంతర్గతంగా విచారించిన అధికారులు మంత్రి నారా లోకేష్ కు సమాచారం ఇచ్చారు. ఘటనపై మంత్రి నారా లోకేష్ శనివారం స్పందిస్తూ…. జరిగిన పొరపాటుకు విద్యార్థులకు తన స్వారీ చెప్తున్నాను అనిx వేదికగా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నచ్చేలా మెనూ ఉండేలా నాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలలో నాణ్యత లేని భోజనం పెట్టిన నిర్వాహకులను తొలగించడంతోపాటు, పాఠశాల హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.

ఏదైనా సమస్య ఉంటే నాకు వాట్సప్ చేయండి వెంటనే దాన్ని పరిష్కరిస్తాను అంటున్నారు లోకేష్. వినుకొండలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ లేక లో వోల్టేజ్ సమస్యతో చీకట్లో మగ్గుతున్నామని ఓ వ్యక్తి ట్విట్టర్లో మంత్రి నారా లోకేష్ కు పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు ఫోన్ చేసి వారం వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి భళా అనిపించారు లోకేష్. తాజాగా పాఠశాల విద్యార్థుల నిరసన ఘటనపై నారా లోకేష్ స్పందించిన తీరు అభినందనీయమని… మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు చేసిన తప్పిదానికి, మంత్రిగా తాను బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పడం నారా లోకేష్ రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.