
జనసేన పార్టీ ఇంచార్జి సయ్యద్ జిలాని నరసరావుపేటలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్ కులాలు, మతాలకు అతీతంగా స్థాపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు.
అయితే, ప్రభుత్వ ఏర్పాటుకి తరువాత కూడా నరసరావుపేటలో పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు అని జిలాని అన్నారు. 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే అరవింద్ బాబు వద్దకు వెళ్లినప్పుడు, “మాకు పావన కళ్యాణ్ చెప్పాలి… అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది అని అవమానించడం జరిగింది.
జిలాని అభిప్రాయం ప్రకారం, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ ఎమ్మెల్యే కారణంగా ఏ న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిలాని.
“నరసరావుపేటలో మా జనసేన కార్యకర్తలు సచివాలయం వద్దకు వెళితే ఎమ్మెల్యే గానీ, టీడీపీ నాయకులు కానీ కనీసం గౌరవించట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
“నరసరావుపేటలో పోలీసుల వద్ద కూడా లా & ఆర్డర్ సరిగా లేదు, డబ్బులు ఉన్న వారికే పనులు అవుతున్నాయి అని ఘాటు విమర్శలు చేశారు జిలాని.
కూటమిని గెలిపించడానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, తెలుగుదేశం ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద బాబు గెలిచిన తర్వాత పది శాతం కూడా న్యాయం జరగలేదన్నారు.
పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని వార్డుల్లో నామినేషన్ వేస్తుందని… అప్పుడు ఐ కమాండ్ ఏం చేస్తుందో చూద్దాం అన్నారు జిలాని.