
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ నాయకులు వేస్తున్న పంచ్‌లు మామూలుగా ఉండటం లేదు. 11 సీట్లు అని ఎగతాలిచేస్తున్నా వైసీపీ నాయకులు మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. అందులోనూ మాజీ మంత్రి పేర్ని నానీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్టర్‌గా పనిచేసిన అనుభవమో, లేక ఉన్నత చదువు వల్లనో, లేక రాజకీయ అనుభవమోగానీ ప్రత్యర్ధులకు ఎక్కడ ఎలా “పంచ”లు వేయాలో పేర్ని నానికి బాగా తెలుసు అని చెప్పక తప్పటం లేదు. ఇక విషయానికి వస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కాగ్ నివేదికపై ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చి మరీ కూటమి ప్రభుత్వం ఆర్ధిక విధానాలపై పలు ప్రశ్నలు వర్షం కురిపించారు జగన్.
ప్రతిపక్ష నాయకుడు జగన్ విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తనదే కాబట్టి, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తనదైన శైలిలో చిట్టా విప్పారు. జగన్‌కు ఆర్ధిక శాఖగురించి ఏమీ తెలియదని, గణాంకాలు అసలు జగన్‌కు అర్ధం కావని చెప్తూ జగన్ కాలంలో చేసిన అప్పులు అవీ ఇవీ కలిపి బాగానే వడ్డించారు.
అయితే మాజీ సీఎం జగన్‌ను విమర్శించేపటికే మాజీ మంత్రి పేర్ని నానికి బాగా మండినట్టుంది. అందుకే తనదైన శైలిలో ప్రెస్మీట్లో పయ్యావుల కేశవ్ గారి పరువు తీసినంత పనిచేశారు. ఆయన ఆర్ధిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి అంటూ ఏకంగా మంత్రి గారిపేరునే మార్చేశారు. బహుశా ఇప్పుడెటూ రాష్ట్రంలో ఆదాయం లేదు కాబట్టి అప్పులుపైనే ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్నట్లు మాజీ మంత్రి ఉద్దేశం కాబోలు. అయితే మొత్తానికీ ఆర్ధిక మంత్రి పయ్యావులకు ఘాటుగా బదులిచ్చిన పేర్ని నాని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మాజీ మంత్రి గారు కావాలని అన్నారో, ఏ ఉద్దేశంతోనే అన్నారోగానీ ఆర్ధిక మంత్రి గారిని చూడగానే అప్పుల మంత్రి అన్నపదం గుర్తు రాకమానదు.