
జైజవాన్..జైకిసాన్…అన్న నినాదం ఒక స్ఫూర్తి. దేశం కోసం రక్షణగా సైనికులు పనిచేస్తుంటే, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం అన్నదాత ఆరుగాలం శ్రమించి ఆకలి తీరుస్తాడు. రైతులు శ్రమపడితేనే దేశం ఆకలి తీరుతుంది. వ్యవసాయం అంటే ఉద్యోగం కాదు, వ్యవసాయం అంటే ఉపాధి కాదు. వ్యవసాయం అంటే సేవ. ఈ సమాజానికి, దేశానికి రైతు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. రైతులు ఎండావానను, రాయిరప్పను లెక్కచేయక, రాత్రీపగలూ తేడాలేక ఆకలిదప్పులనెన్నో భరించి దుక్కిదున్నింది మొదలు పంట ఇంటికి చేరేవరకు ఓ యుద్ధమే. ఎంతో తపన, ఎంతో శ్రమ. ప్రసవ సమయంలో తల్లిపడే బాధను వర్ణించలేము. పంట పండించే క్రమంలో రైతు పరిస్థితి కూడా అంతే. అన్నదాతల కుటుంబాలు, వారి జీవన విధానం భిన్నంగా ఉంటుంది. విలాసాలుండవు, ఆటవిడుపులుండవు, ఆకాశం, భూమాత మధ్యన రైతుపడే శ్రమ ఎంతో గొప్పది. ఆ గొప్పతనాన్ని కాపాడుకొనేందుకు పాలకులు, ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. రైతుకు చేతనైన సాయం చేయటం కాదు…రైతును ఆదుకోవటం ప్రభుత్వాల బాధ్యత. రైతును గౌరవించటం ప్రజలందరి బాధ్యత.

ఇక అన్నదాతనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయం విషయానికి వస్తే….
అన్నదాతలకు ఏటా రూ.20,000/ల ఆర్ధిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 2024 జూన్ నెలలో అధికారపగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు పర్యాయాలు అన్నదాత సుఖీభవపీఎం కిసాన్‌ను విజయవంతంగా అమలు చేశామని చెప్తున్నారు. మొదటి విడతగా 2025 ఆగస్టు 2న రూ.7వేలు, నవంబర్ 19న 2వ విడతగా రూ.7వేలు మొత్తం రూ.14వేలు ప్రతిరైతుకు జమచేయగా తాజాగా ఈరోజు అనగా ది.13.03.2026న డతగా ఈరోజు 20252026 సంవత్సరానికి గానూ అన్నదాత సుఖీభవపీఎం కిసాన్ పథకం ద్వారా రూ.8,985 కోట్లు జమ చేయగా అందులో రాష్ట్రం వాటా రూ.6,560 కోట్లు, కేంద్రం వాటా రూ.2,425 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా ప్రతి రైతుకు ఈరోజు ఖాతాల్లో రూ.6000/లుజమ అవుతుండగా, అందులో అన్నదాత సుఖీభవ నగదు రూ.4000, పీఎం కిసాన్ నగదు రూ.2000/లు జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838(సుమారు 47 లక్షల)మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.