
ఓడిపోయిన నీ ప్రేమని గెలిపించుకొనేందుకు…
చీకటి కడుపును చీల్చు కుంటూ మళ్ళీ పుడతావురా భైరవా “….
ఈమాటలు వింటుంటే…
ప్రశ్నించటమే మర్చిపోయిన ఈ సమాజాన్ని మేల్కొలిపేందుకు
ఆ సుభాష్ చంద్ర బోస్ మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది… రాఘవ్ చద్దా ను చూస్తే…
అతను ఒక ఎంపీ మాత్రమే కాదు… కొట్లాడి మంది ప్రజల గొంతుకేమో అనిపిస్తుంది…వందలాది మంది అంబెడ్కర్ ఒక్కటై వచ్చినట్టుగా ఉంది….
రాజకీయాలంటే ఆసక్తి లేనివాడికైనా …
అసెంబ్లీ సమావేశాలు కూడా ఎప్పుడూ చూడని వాడికైనా…
ఎంపీ రఘువ్ చద్దా మాటలు అరటి పండు వలిచి నోటిలో పెట్టినట్టు అర్ధమౌతాయి…
ఆ మాటలు పార్లమెంట్ గోడల మధ్యనే వినిపించినా…
నేడు దేశం మొత్తం ప్రతిధ్వనిస్తున్నాయి…
ప్రతి భారతీయుడిని ఆలోచింప చేస్తున్నాయి…
ప్రతిపక్ష నాయకులకు పరవసాన్ని…
పాలకులను వెక్కిరింపులకు గురించేస్తున్నాయి…
ఇంతకీ ఎవరీ యువ ఎంపీ…
ఏమిటాయిన ప్రత్యేకత…
ఏమిటయన ప్రసంగం…
ఎందుకు అవి తెలుసుకోవాల్సిన అవసరం….
“పొలిటికల్ టెంపర్”….
“యువ ఎంపీ సూపర్….“అంటోంది అని

ఆమ్ ఆద్మీ పార్టీ యువ ఎంపీగా రాఘవ్ చద్దా….
దేశ రాజకీయాల్లో యువ నాయకులలో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు రాఘవ్ చద్దా.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక పాత్ర పోషిస్తూ తక్కువ వయస్సులోనే జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
1988 నవంబర్ 11న ఢిల్లీలో జన్మించిన రాఘవ్ చద్దా వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్.
యువకుడిగా ఉన్నప్పుడే అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించారు.
ఇదే ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరిన తరువాత పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారు.
పార్టీ నేషనల్ ట్రెజరర్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేసి పార్టీకి బలమైన యువ నాయకుడిగా ఎదిగారు.
2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు.
అదే సమయంలో ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
పార్లమెంట్లో వివిధ ప్రజా సమస్యలపై చర్చలు జరిపి, ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పనితీరుపై బాధ్యత పెంచే విధంగా “రైట్ టు రికాల్ ” వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ఆయన చర్చకు దారి తీశారు.
వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ నటి పరినీతి చోప్రా ను 2023లో వివాహం చేసుకోవడంతో జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించారు.
యువ నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న రాఘవ్ చద్దా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మరింత ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాఘవ్ చద్దా ప్రశ్న… సోషల్ మీడియాలో పెద్ద చర్చ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ Raghav Chadha పార్లమెంటులో లేవనెత్తిన టెలికాం కంపెనీల విధానాలపై ప్రశ్న దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 2026లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మొబైల్ రీఛార్జ్ విధానాలపై తీవ్రంగా స్పందించారు.
మొబైల్ ఫోన్ వినియోగదారులపై టెలికాం సంస్థలు అమలు చేస్తున్న “మినిమమ్ రీఛార్జ్” విధానం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి తన డబ్బుతో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, తన పేరుతో సిమ్ కార్డు తీసుకున్నప్పటికీ బ్యాలెన్స్ లేకపోతే అవుట్గోయింగ్ కాల్స్ నిలిపివేయడం సరే కానీ, ఇన్కమింగ్ కాల్స్‌ను కూడా నిలిపివేయడం సరైన విధానం కాదని ప్రశ్నించారు.
ఈ విధానం వల్ల ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసం కూడా ప్రతి నెలా కనీస రీఛార్జ్ చేయాల్సి రావడం సామాన్యులకు భారంగా మారిందని అన్నారు.
అదేవిధంగా బ్యాంక్ OTPలు, ఉద్యోగ సమాచారం, అత్యవసర కాల్స్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులు ప్రజల ప్రాథమిక అవసరాలకు ఆటంకం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా టెలికాం సంస్థలు మాత్రం తమ వాదనను వినిపిస్తున్నాయి. Reliance Jio, Bharti Airtel, Vodafone Idea వంటి సంస్థలు నెట్వర్క్ నిర్వహణకు భారీ ఖర్చులు అవుతున్నాయని, వినియోగదారుడు యాక్టివ్‌గా లేకపోయినా నంబర్‌ను నిర్వహించడానికి ఖర్చు ఉంటుందని చెబుతున్నాయి. అందుకే “సర్వీస్ వాలిడిటీ” ప్లాన్లు అవసరమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో Telecom Regulatory Authority of India (TRAI) కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మినిమమ్ రీఛార్జ్ నిబంధనలను పునఃసమీక్షిస్తూ, ఇన్కమింగ్ కాల్స్‌ను ఎక్కువ కాలం వరకు అందుబాటులో ఉంచే విధంగా మార్గదర్శకాలు తీసుకురావాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇక ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికీ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంలో ఉంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNLలో ఇన్కమింగ్ సదుపాయాలను మెరుగుపరచడం లేదా ప్రైవేట్ కంపెనీలపై కొన్ని నియంత్రణలు విధించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అయితే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ గడువు ముగిసిన కొద్ది రోజులకే ఇన్కమింగ్ సేవలను కూడా నిలిపివేస్తున్నారు. TRAI నుండి కొత్త మార్గదర్శకాలు వెలువడితే కోట్లాది మొబైల్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ పార్లమెంట్ సాక్షిగా ఒక కీలకమైన, సామాజికంగా నిగూఢంగా ఉండిపోయిన అంశంపై చర్చ మొదలైంది. దేశంలోని సగం సగం జనాభా ప్రతి నెల ఎదుర్కొనే రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ఆమ్ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. కేవలం ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా, ేశంలోని కోట్లాది మంది మహిళల ప్రతినిధిా తాను మాట్లాడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని సామాజిక నిషిద్దం నుంచి శాస్త్రియ చర్చగా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భయానక వాస్తవం
రాఘవ చద్దా తన ప్రసంగంలో వెల్లడించిన గణాంకాలు దేశంలో మహిళా విద్య, ఆరోగ్యం పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని అద్దం పడుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం 35 కోట్ల మందికిపైగా మహిళలు రుతుక్రమం వయసులో ఉన్నారని తెలిపారు. వీరిలో దాదాపు 12 కోట్ల మంది కౌమార దశలో బాలికులు. వీరంతతా సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
దీని పర్యావసానంగా దేశంలో ప్రతి ఏటా 2.3 కోట్ల మంది బాలికలు చదువులు మానేస్తున్నారని చద్దా వివరించారు. కేవలం సానిటీ ఉత్పత్తుల లభ్యత లేకపోవడం, పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల మన దేశ భవిష్యత్ అయిన ఆడబిడ్డలు చదువుకు దూరం కావడం అత్యంత ఆందోళనకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక బాలిక ఏడాదికి 60 రోజులు పాఠశాలను, ఉద్యోగినులు నెలకు 2 నుంచి ఐదు రోజులు పనిని కోల్పోతున్నారని ఆయన వివరించారు.
సోషల్ స్టిగ్మా
మద్యం సిగరెట్లు బహిరంగంగా అమ్ముతారని, కానీ శానిటరీ ప్యాడ్లు మాత్రం ఏదో అక్రమ వస్తువులా పేపర్లో చుట్టి ఇస్తారని చద్దా గుర్తు చేసారు. రుతుక్రమం అనేది ఒక సహజ జీవక్రియ అని కానీ దాన్ని సమాజం ఒక అపవిత్రమైన విషయంగా, రహస్యంగా ఉంచాల్సిన అంశంగా మార్చేసిందని చెప్పారు. ఒక సర్వే ప్రకారం 33 శాతం మహిళలకు తమ మొదటిసారి పిరియడ్స్ వచ్చే వరకు దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. సరైన సమాచారం లేకపోవడం వల్ల 91.7 శాతం మంది మహిళలు వివిధ రకాల అనారోగ్యం సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా రీప్రొడక్టిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన వ్యాధులు బారిన పడుతున్నారని సామాజిక భయం వల్ల వారు వైద్యుల వద్దకు వెళ్లలేకపోతున్నారని ఆయన వివరించారు. బడుల్లో టాయిలెట్లు ఉండటం ఒక్క ఎత్తైతే, అవి వాడకానికి వీలుగా ఉండటం మరో ఎత్తు అని చద్దా స్పష్టం చేశారు. నీటి సౌకర్యం, గోప్యత, ప్యాడ్లను పారవేసి బిన్లు లేని పక్షంలో ఆ టాయిలెట్లు కేవలం గదులుగానే మిగిలిపోతాయని విమర్శించారు. దేశంలోని 25 శాతం పాఠశాలల్లో ప్రాథమిక పారిశుద్ధ్య సేవలు లేవని, 46 శాతం పాఠశాలల్లో కనీసం చేతులు కడుక్కోవడానికి సోపులు కూడా ఉండటం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. పీరియడ్ పావర్టీ శానిటరీ ప్యాడ్లపై జీఎస్టీని ప్రభుత్వం తొలగించినప్పటికీ, వాటిని తయారు చేసే ముడి సరకులపై ఇంకా జీఎస్టీ కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. దీని వల్ల ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. భారత్‌లో ఒక మహిళ తన పీరియడ్స్ పరిశుభ్ర కోసం నెలకు సగటున 300 నుంచి ఐదు వందలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది మన దేశంలోని కనీస రోజువారి వేతన కంటే రెండు రెట్లు ఎక్కువ. అందుకే కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే మార్కెట్లో దొరికే శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు.
ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు
ఈ సమస్యల పరిష్కారానికి రాఘవ్ చద్దా ఆరు ప్రధాన డిమాండ్లను సభకు వివరించారు. అన్ని పాఠశాలలు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్లు, వినియోగించదగిన టాయిలెట్లు అందుబాటులో ఉంచాలి. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల ద్వారా నేరుగా ఇళ్లకు నాణ్యమైన ఉత్పత్తులను చేరవేయాలి. శానిటరీ ఉత్పత్తుల ముడి సరకులపై ఉన్న జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి. శానిటరీ ఉత్పత్తుల ముడి సరకులపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. రుతుక్రమ ఆరోగ్యం గురించి కేవలం బాలికలే కాకుండా బాలురకు కూడా పాఠశాల పాఠ్య ప్రణాళికలో అవగాహన కల్పించాలి. అప్పుడ సమాజంలో ఉన్న సైలెన్స్ పోతుంది. ప్యాడ్లను పారవేయడానికి పర్యావరణహితమైన జాతీయ స్థాయి యంత్రాంగం ఏర్పాటు చేయాలి. జిల్లాస్థాయిలో ప్రతి ఏటా మౌలిక సదుపాయాలపై తనిఖీలు చేసి, పబ్లిక్ రిపోర్ట్లు విడుదల చేయాలి. ఈ అంశాన్ని కేవలం మహిళల సమస్యగా చూడకుండా పబ్లిక్ హెల్త్ అంశంగా పరిగణించి చట్టబద్ధమైన మార్పులు తీసుకురావాలని చద్దా సభను కోరారు.
రాఘవ చద్దా పార్లమెంటు ప్రసంగాలు అటు పార్లమెంట్ లోనే కాక ఇది యావత్తు దేశ ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి, రాజకీయ నాయకులు పాలకుల తీరు మారాలని దేశ ప్రజలకు మరింత మేలు జరగాలని భారతదేశం.. మరింత ఉన్నత స్థాయిలో భారత ప్రజలు ఉండాలని కోరుకుంటూ…
దేశ ప్రజల కోసం దేశ భవిష్యత్తు కోసం సమ సమాజం కోసం తన గలాన్ని పార్లమెంటులో వినిపించిన ఎంపీ రాఘవ శబ్దకు పొలిటికల్ టెంపర్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను…
ఎడిటర్