
సింహం సింగిల్ గా నే వస్తుందా..?
ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాలు
పొత్తు కోసం పవన్ ని రంగంలోకి దించిన బిజెపి నాయకత్వం
బిజెపితో కలిసేది లేదంటున్న విజయ్ దళపతి..?
తమిళ నాట పవన్ వ్యూహాలు ఫలించేనా..?
పొలిటికల్ టెంపర్ ప్రత్యేక కథనం:
ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో బిజెపి అధినాయకత్వానికి తెలిసినంతగా దేశ రాజకీయాల్లో మరి పార్టీకి తెలియదని చెప్పవచ్చు.
బిజెపి అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్న భవిష్యత్తు వ్యూహాలను రచిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.
పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నప్పుడే దేశ రాజకీయాల్లో అవసరమైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించి సక్సెస్ సాధించిన బిజెపి అగ్రనాయకత్వం తాజాగా పవన్ కళ్యాణ్ ని తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కి కీలక బాధ్యతను అప్పగించింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో తమిళనాడు వైపే అందరి దృష్టి నెలకొంది.
ఈ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ నటుడు విజయ్ దళపతి టీవీ కె పార్టీ స్థాపించి, తొలిసారి ఎన్నికల బదులు నిలిచారు.
విజయ్ ఎన్నికల ప్రచార శైలి ఇతర పార్టీలకు భిన్నంగా సాగింది లక్షలాది జన సమూహం ఆయన సభలకు తరలివచ్చింది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఇటీవల సర్వేలు విజయ్ వైపు మొగ్గు చూపాయి.
ఈ నేపథ్యంలో విజయ్ తన భార్యతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఆయన పార్టీకి ఏమాత్రం నష్టం చేకూరుస్తాయో అన్నదానిపై చర్చ నడుస్తోంది.
విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ తన స్నేహితురాలు, సినీనటి త్రిషతో ఓ పెళ్లికి హాజరు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఓవైపు బిజెపి తన కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది.
తమిళనాడు విజయని విమర్శిస్తూనే… మరోవైపు పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించి పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ – టి వి కే అధినేత విజయ్ తో భేటీ అయినట్లు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే తనకు ప్రధాన ప్రత్యర్థి బిజెపి అని, బిజెపి- డిఎంకెతోనే తన పోరాటం ఉంటుందని చెప్పటంతో పాటు, సింహం సింగిల్గానే వస్తుంది అని బహిరంగ వేదికలపై తేల్చి చెప్పారు విజయ్ దళపతి.
విజయ్ కి లభిస్తున్న జనాధరణతో బిజెపిలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బిజెపి పరిస్థితిమెరుగుపరుచుకునేందుకు పవన్ కళ్యాణ్ ని బిజెపి అధినాయకత్వం రంగంలోకి దించినట్లు సమాచారం.
పవన్ రాయబారంతో పొత్తు కుదురుతుందని చర్చ జరిగినప్పటికీ అందుకు టీవీ కె విజయ్ అంగీకరించలేదని తెలిసింది.
గెలిచినా ఓడినా సింహం సింగిల్ గానే వస్తుంది అని పవన్ కళ్యాణ్ కి విజయ్ తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
తన కుటుంబంలో చిచ్చు పెట్టి, తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్న బిజెపి నీ ఎప్పటికీ శత్రువు గాని చూస్తానని విజయ్ తెగేసి చెప్పినట్లు సమాచారం.
చూద్దాం తమిళనాడు ఎన్నికల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రసవత్తర సన్నివేశాలు ఏ మలుపులు తిరుగుతాయో, బిజెపి మున్ముందు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో, వేచి చూడాలి.