
తమిళనాడులో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ దళపతిని బాగా గమనిస్తే… రాజకీయ నడకలో జగన్… మేనిఫెస్టో రూపకల్పనలో చంద్రబాబు నాయుడుని ఇద్దరినీ కలిపి… జగన్ చంద్రబాబు నాయుడు వ్యూహాలను రంగరించి తమిళనాడులో సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది… సూపర్ సిక్స్ అమలు చేసి తీరతం అని ఆ రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ దళపతి.
పార్టీ ఆవిర్భావం నుంచి, పార్టీ బహిరంగ సభలు నిర్వహణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్టైల్ అనుసరిస్తున్నారు అని చెప్పక తప్పదు… జగన్ సిద్ధం సభలు నిర్వహించిన తీరులోనే విజయ్ కూడా బహిరంగ సభలను నిర్వహించి భారీ జన సమీకరణ నిరూపించుకోగలిగారు.
బహిరంగ సభలో నిర్వహించడమే కాక… రాజకీయాల్లో జగన్ అనుసరించిన ప్రస్తుతం అనుసరిస్తూ ఉన్న పొత్తులు లేని రాజకీయం… టీవీ కే సిద్ధాంతమని స్పష్టంగా చెప్పారు. తమిళనాడులో బలంగా ఉన్న అధికార డిఎంకె ప్రతిపక్ష ఏఐ డీఎంకే కుటమే తమ ప్రధాన శత్రువులని, వారి పైనే ప్రధానంగా పోటీ ఉంటుందని స్పష్టమైన రాజకీయ విధానాన్ని ప్రకటించారు విజయ్.
ఇటీవల తన కుటుంబంలో భార్య రూపంలో వచ్చిన సమస్యను సైతం తాను ఒక్కడినే ఆ సమస్యను పరిష్కరించుకోగలనని అభిమానులు ఆలోచించవలసిన అవసరం లేదని తన మనోధైర్యాన్ని ప్రదర్శించారు విజయ్.
తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తీరులో మనోధైర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు జగన్.
విజయ్ తో పొత్తు కోసం బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేసిందని సమాచారం. ఓవైపు విజయ్ ని కేసులు వెంటాడుతున్న, భార్య విడాకులకు వెళ్లిన, పిల్లలు దూరమైనా, విజయ్ ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు.. ఒత్తు కోసం ఎంత ఒత్తిడి తెచ్చిన తన మార్గం మార్చుకోలేదు. సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుంది అని పదే చెబుతూ విమర్శకుల మూయిస్తున్నారు విజయ్.
జగన్‌ని అచ్చు గుద్దినట్లు స్టైల్ లోనూ పార్టీ విధివిధానాల్లోనూ జగన్‌ను అనుసరిస్తున్న విజయ్ దళపతి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన నగదు బదిలీ పథకాలపై కూడా కసరత్తు చేసి ముఖ్యమైన పథకాలను తమిళనాడు ప్రయోగించేందుకు తన హామీలలో పొందుపరిచారు.
విజయ్ దళపతి జగన్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కూడా అనుసరిస్తున్నారని స్పష్టం అవుతుంది.. సూపర్ సిక్స్ హామీలు అంటూ తమిళనాడు విడుదల చేసి చంద్రబాబు నాయుడు తరహాలో ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి పథకాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు విజయ్…
విజయ్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో లోని అంశాలను పరిశీలిస్తే….
ప్రజల సమస్యలపై ఫోకస్ చేస్తూ, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆయన ప్రకటించిన హామీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మహిళల సంక్షేమం కేంద్రబిందువుగా టీవీకే మేనిఫెస్టో ఉందన్న వాదన వినిపిస్తుంది.
మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, దాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు.
ఆర్థిక భరోసా – కుటుంబాలకు పెద్ద మద్దతు
పిల్లల చదువు మానేసే పరిస్థితులు తగ్గించేందుకు తల్లులు లేదా గార్డియన్లకు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇది పేద కుటుంబాలకు పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది.
మహిళల భద్రత, స్వావలంబనపై దృష్టి
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమాజంలో మహిళలు మరింత ధైర్యంగా ముందుకు రావడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇది ఉద్యోగాలు, విద్య, రోజువారీ అవసరాలకు పెద్ద సాయం అవుతుంది.
ఇంటి ఖర్చులపై ఊరట
ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. దీంతో గృహ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
వివాహాల కోసం ప్రత్యేక సాయం…
మహిళల పెళ్లిళ్లకు “అన్నగా” ఒకటిన్నర సవర బంగారం ఇస్తామని చెప్పడం మరో ప్రత్యేక హామీగా నిలిచింది.
రాజకీయాల్లో కొత్త ట్రెండ్…?
విజయ్ ప్రకటించిన ఈ పథకాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాయి. సంక్షేమం, మహిళా సాధికారత, కుటుంబ భద్రత అనే మూడు కీలక అంశాల చుట్టూ ఆయన రాజకీయ వ్యూహం తిరుగుతోంది.
సౌత్ రాజకీయాల్లో పెరుగుతున్న ప్రభావం
ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రభావం కనిపిస్తుండగా, విజయ్ కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా “సూపర్ సిక్స్” తరహా హామీలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, విజయ్ రాజకీయ ఎంట్రీ కేవలం స్టార్డమ్తో కాకుండా, సంక్షేమ అజెండాతో ముందుకు సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఈ హామీలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.
