
పల్నాడు జిల్లా : వినుకొండ కొండను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కృషి చేస్తున్నారు. జీవి చొరవతో వినుకొండ కొండకు మహర్దశ పట్టనుంది. గిరి ప్రదక్షిణ రోడ్డుకు శంకుస్థాపన చేసిన జీవీ ఆంజనేయులు, కొద్దిసేపటి క్రితం రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ కొండ చుట్టూ ప్రదక్షణ కోసం తారు రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.
3.5 కి. మీ గిరి ప్రదక్షిణ మార్గంలో రెండు కిలోమీటర్లు కొత్తగా రోడ్డు వేయనున్నామ్మన్నారు.
50 అడుగుల వెడల్పు తో ఏర్పాటు చేస్తున్న దారిలో 30 అడుగుల తారు రోడ్డు, మిగిలా 20 అడుగులు మట్టి రోడ్డుగా నిర్మిస్తామన్నారు.
కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లు నిధులు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిధులు తెస్తానని చెప్పారు. గిరి ప్రదక్షిణ రోడ్డు, ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయిన తదుపరి భక్తుల సహకారంతో కొండపైకి మెట్లు మార్గాన్ని పునర్మిస్తామని జీవీ తెలిపారు.
ఆయనతోపాటు మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాదు. గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రోశయ్య తదితరులు ఉన్నారు.
