
వైయస్ జగన్ సూటి ప్రశ్న..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 21 నెలల్లో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లలోని కోతలు పెడుతూ వెళ్తున్న కూటమి ప్రభుత్వం మరికొన్ని పెన్షన్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఎప్పుడు ఇస్తారన్న విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదన్నారు జగన్.
50ఏళ్లు నిండిన ST,SC,BC మైనార్టీలకు పెన్షన్ కింద నెలకు రూ.4వేలు చొప్పున ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో కనీసం మాట్లాడకపోవటం విడ్డురం గా ఉందన్నారు.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం 5,64,709 పెన్షన్లు కట్ చేశారని ధ్వజమెత్తారు జగన్. ఇప్పుడు ఇస్తున్న వారికి కూడా పెన్షన్స్ ఇవ్వడానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు లేవని, పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పకనే చెప్తున్నారు అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ప్రతినెలా 25వేలకు పైగా పెన్షన్లు కట్ చేస్తున్నారు, కొత్తగా ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వలేదు, ప్రభుత్వం వద్ద లక్షల సంఖ్యలో పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లు ఎప్పుడు ఇచ్చేది తక్షణమే చెప్పాలి చంద్రబాబు అంటూ జగన్ ప్రశ్నించారు.