అన్న జగన్ మీద చెల్లి షర్మిల కి ఇంకా కోపం తగ్గలేదు. అన్న కోసం షర్మిల వైసీపీ తరపున 2019 ఎన్నికలకు పాదయాత్ర కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అన్నకు అండగా ఉన్న షర్మిల.. అధికారంలోకి వచ్చాక ఎక్కడ చెడిందో తెలియదు కానీ బద్ద శత్రువుగా మారిపోయారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే కానీ.. రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించేందుకు అన్నా చెల్లెలు కలిసి అడుగులు వేస్తే వైయస్ అభిమానులు తెగ సంబరపడ్డారు.
2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్న చెల్లికి ప్రధాన శత్రువు అయిపోయాడు. జగన్ ని ఓడించడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల అడుగులు వేశారు. అన్నకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల.. అన్న ఓటమిని కళ్ళారా చూడాలని ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మారిపోయారు.
ఈ క్రమంలో అన్నకు ప్రత్యర్ధులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ లకు పరోక్షంగా సహకరించారు. పుట్టినరోజులకు సొంత అన్నకు విషెస్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు చెప్పడం రాష్ట్ర ప్రజలకు తెలియని విషయమేమీ కాదు.
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పరాజయం పాలయ్యారు వైఎస్ జగన్. 151 సీట్ల నుండి 11 సీట్లకు నిలువునా పడిపోయారు. ఓడిన తిరిగి రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీని నడిపిస్తున్నారు జగన్.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్లు ఉన్నప్పటికీ రాజకీయమంతా జగన్ చుట్టూనే తిరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. జగన్ అసెంబ్లీకి వచ్చిన రాకపోయినా ఉభయ సభల్లో జగన్ పేరే వినిపిస్తుంటుంది.. జగన్ మీదనే విమర్శల వాన కురుస్తుంటుంది. ఇది వాస్తవం.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి సంక్షేమాన్ని పెద్దగా చెప్పినా చెప్పకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఆయన పాలనలో జరిగిన తప్పులను ఎత్తిచూపటమే ప్రధాన అజెండాగా పెట్టుకుని ప్రెస్మీట్లో బహిరంగ సభలలో ఘాటుగా ప్రసంగాలు ఇస్తుంటారు. టిడిపి జనసేన నాయకులకు బిజెపిలోని కొద్దిమంది నాయకులకు ఇదే అలవాటు నేటికీ కొనసాగుతూ వస్తుంది. వీరంతా విమర్శించిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రత్యర్థి పై వీలు కుదిరినప్పుడల్లా నాలుగు మాటలు మాట్లాడితే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కాస్త ఉత్సాహపడతారు. మేము బలంగానే ఉన్నాము అన్న సంకేతాలు టిడిపి నాయకులు ఇవ్వడం సహజమే.
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం గమనించాల్సిన విషయం విశేషం ఏమిటంటే…
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి 20 నెలలు గడిచినా.. నేటికీ ప్రధాన ప్రచార అస్త్రంగా జగన్ నిలవడం ఆలోచించాల్సిన విషయం. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడించిన ఓటమి పార్టీలు ప్రతిరోజు జగన్ జపం చేయకుండా ఉండలేరు. జగన్ పేరు విస్తృతంగా నేటికీ ప్రజల్లో నానుతుంది అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కాదు. కూటమిలోని ప్రజాప్రతినిధులే నిత్యం జగన్ నామస్మరణతో రాష్ట్రంలో జగన్ పేరు ప్రతిష్టలను మరింత పెంచుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీని మరింత చర్చనీయాంశంగా మారుస్తున్నారు.
కూటమి నాయకులకు అలవాటైనప్పటికీ…
రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలమ్మ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల..
జగన్అ తను అధికారంలోకి వస్తేకేం కేద్రం కాలర్ పట్టుకుని ప్రత్యేక హోదా సాధిస్తామని మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు.. జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ముఖ్యమంత్రి అయ్యాక ప్రధాని మోదీ కాళ్లమీద పడ్డారని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలుచే స్తామని చెప్పి, ఏపీని లిక్కర్ మాఫియాకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ పర్యటనలోనే కాదు ఎక్కడ పర్యటన జరిగినా అక్కడ తన అన్న జగన్మోహన్ రెడ్డి పైనే ప్రధానంగా విమర్శలు గుప్పించడంతో షర్మిలమ్మకు జగన్ పై ఇంకా కోపం తగ్గలేదేమో… జగన్ అధికారంలో లేకపోయినా ఇంకా జగన్ని విమర్శిస్తున్నారు.. అధికార పార్టీని కనీసం ప్రశ్నించడం మానేశారు.. అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా అధికారం పోయాక ఇప్పుడు విమర్శిస్తే జగన్ ఏమి చేయగలడు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షర్మిల మాటలపై గురువుగానే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు కొనసాగిస్తున్న షర్మిల… తన అన్న ఇంకా అధికారంలో ఉన్నాడనుకుంటుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మెప్పు కోసమైనా తన అన్నను విమర్శిస్తున్నారు కాబోలు అని చర్చించుకుంటున్నారు. షర్మిల ఇటీవల పార్టీ అధినాయకత్వాన్ని కలిసి వచ్చారు. షర్మిల ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు గా షర్మిలను తొలగిస్తారు అన్న ఊహాగా నలుగుపందుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తన అన్న జగన్ పై కోపం ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాలి.