అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మహోన్నతమైనదని, తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు చరిత్ర శాశ్వతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా అమరావతి పరిధిలోని శాఖమోరు వద్ద 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. తెలుగుజాతి ఐకమత్యాన్ని పొట్టి శ్రీరాములు కోరుకున్నారని ఆయన స్ఫూర్తితో తెలుగువారంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు. ఒక్క పిలుపుతో 3300 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో విధ్వంసం సృష్టించారని అన్నారు.
రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులు ఇచ్చిన ప్రతి ఒక్క రైతు అమరావతి నిర్మాణం పూర్తి కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నారని అందుకే రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు వెళుతున్నామని భవిష్యత్తులోనూ కలిసే వెళ్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కూటమి ఏర్పాటైందని రాష్ట్ర అభివృద్ధి చేసి దేశంలో ప్రదర్శిస్తానములో నిలిపి దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానమే ప్రత్యేక రాష్ట్రం: పవన్ కళ్యాణ్
పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి లో 58 పొట్టి శ్రీరాములు అడుగుల భారీ కాంస్య విగ్రహ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకుని రాష్ట్ర అభివృద్ధికి కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.