
- ఇశ్రాయేలు కు మద్దతుగా అమెరికా…
- రంగంలోకి రష్యా..
- ఇరాన్ కు నేనున్నా : పుతిన్
యుద్ధంలో కీలక మలుపు. ఇరాన్ పై మూకుమ్మడిగా దాడి చేసి ముప్పతిప్పలు పెడుతున్న ఇజ్రాయిల్ అమెరికా దేశాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ అండగా ఉంటానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గల్ఫ్ దేశాలపై విజృంభిస్తున్న ఇరాన్, ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా బాంబు దాడులుతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా తీసుకున్న నిర్ణయం యుద్ధ గమనాన్ని మార్చే అవకాశం లేకపోలేదు. ఇరాన్ కు రష్యా
వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయెల్-అమెరికాలతో చేస్తున్న యుద్ధంలో తమ మిత్రదేశమైన ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. తన తండ్రి ఖమేనీ స్థానంలో వచ్చిన ముజబా ఇరాన్ ను యుద్ధాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అండగా నిలవడం ఇరాన్ కు కష్టకాలంలో భరోసా లభించింది. ఇరాన్ కు అండగా ఉంటామని ప్రకటించిన రష్యా ఇంత తీరును క్షుణ్ణంగా గమనిస్తోంది. భవిష్యత్తులో రష్యా ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇరాన్ తక్షణమే యుద్ధం ఆపేసి ఓటమిని అంగీకరించి తమ దేశాన్ని కాపాడుకోవాలని ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న ఇరాన్ మాత్రం ఎక్కడ లెక్క చేయడం లేదు. యుద్ధంలో ఇప్పటికే భారీ ప్రాణ నష్టం, అంతకు పదింతలు ఆస్తి నష్టం సంభవించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. యుద్ధం కారణంగా ఇప్పటికే భారత దేశంలో ఆయిల్, గ్యాస్ ధరలు పెంపు నిర్ణయంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.