వినుకొండలో “దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్” కొనసాగింపు…
వినుకొండ : పల్నాడు జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు పిలుపు మేరకు ఈనెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం యధావిధిగా కొనసాగించాలని వినుకొండ దస్తావేజులేఖర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం నుండి నెలాఖరు వరకు రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపుమేరకు విధులను బహిష్కరించి, పెన్ డౌన్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 31వ తేదీ తదుపరి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు నడుచుకోవాలని వినుకొండ లేఖర్లు నిర్ణయించారు. పల్నాడు జిల్లా కమిటీ నాయకులు నాగభూషణరావు, యోగాంజనేయ శర్మ, జుజ్జురి సుబ్బాచారి తదితర నాయకులతో కలిసి వినుకొండ దస్తావేజు లేఖలు సబ్ రిజిస్ట్రార్ షేక్ మాలిక్ షా ని కలిసి బంద్ కొనసాగింపు నిర్ణయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని దస్తావేజు లెక్కల సంఘ నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర పలనాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 396 జీవో అమలు అయితే…
రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటుకి కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, ప్రజల ఆస్తులని కాపాడేందుకు, దస్తావేజు లేఖర్లు వృత్తి ని కాపాడు కోనేందుకు చేపట్టిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.