అతి త్వరలోనే ఏపీ ఎన్నికల షెడ్యూల్…?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన రెండు జీవోలను న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జనగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు, తదుపరి ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ఆదేశించింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పాటు కోర్టు గడువు విధించడంతో, పంచాయతీ, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల దిశగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది.