వినుకొండ నియోజకవర్గంలో ముగిసిన గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ..
పల్నాడు జిల్లా, వినుకొండ:
వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లోని 119 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు మొత్తం 672 నామినేషన్లు దాఖలయ్యాయి.
1,142 వార్డుల సభ్యుల పదవులకు 2,677 నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలాల వారీగా సర్పంచ్ నామినేషన్లలో… బొల్లాపల్లి 199,
నూజెండ్ల 148,
వినుకొండ 138,
ఈపూరు 112,
శావల్యాపురం 75 నమోదయ్యాయి.
వార్డు సభ్యుల నామినేషన్లలో…
బొల్లాపల్లి 716,
నూజెండ్ల 601,
వినుకొండ 537,
ఈపూరు 481,
శావల్యాపురం 342 దాఖలయ్యాయి.
మూడు రోజుల నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే…
సర్పంచ్ పదవులకు మొదటి రోజు 166,
రెండో రోజు 323,
మూడో రోజు 183 నామినేషన్లు వచ్చాయి.
వార్డు సభ్యుల పదవులకు మొదటి రోజు 493,
రెండో రోజు 1,238,
మూడో రోజు 946 నామినేషన్లు దాఖలయ్యాయి.
మొత్తంగా వినుకొండ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీకి భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.