
“నాకు కొంచెం తిక్కుంది..
కానీ దానికో లెక్కుంది”… పవన్ కళ్యాణ్.
ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు… పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో నిజంగా తెలిసిన ప్రతి అభిమాని దీనిని నమ్ముతాడు.
ఎందుకంటే ఆ తిక్క… దాని వెనుక ఉన్న లెక్క మొదట్లో అర్థం కాకపోయినా 2024 ఎన్నికలు ఫలితాలు చూశాక జనసేన కార్యకర్తలకు నాయకులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు బాగా అర్థమైంది.
100% స్ట్రైక్ రేట్ తో తనతోపాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లాడు.
రెండు చోట్ల ఎమ్మెల్యే గా ఓడిపోయిన వాడు… ఆ రెండు కి 10 రెట్లు అదనపు సీట్లు గెలిపించాడు.
అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయం అన్న వారినే అసెంబ్లీకే రాకుండా చేశాడు.
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడి సరసన నిలిచి… కాడెద్దుగా మారి…భుజాన భారం మోపుకున్నాడు.
ప్రజల ఆలోచనలు పసిగట్టి… పొత్తు కలిసాడు… బలమైన శక్తిగా నిలిపేందుకు కూటమి గట్టాడు…ఈ ఒక్క “వ్యూహం”తో భవిష్యత్ ఏమిటో కళ్ళకు కట్టాడు…
గల్లీ(గ్రామాల్లో)ల్లో పాలన చేస్తూ..ఢిల్లీ లోనూ కీలకంగా మారాడు…
అందుకే…
పవన్ కళ్యాణ్ సినీ స్టార్ మాత్రమే కాదు…
పవర్ ఫుల్ పొలిటికల్ స్టార్…అని నిరూపించుకున్నారు

జనసేన ఆవిర్భావ దినోత్సవం….
ఉద్యమం నుంచి అధికార భాగస్వామ్యం వరకు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన జన సేన పార్టీ తన ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగింది. పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ యకత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమం, 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా మారింది.

2014లో మద్దతుతో రాజకీయ అరంగేట్రం…
2014 ఎన్నికల్లో జనసేన పార్టీ నేరుగా పోటీ చేయకపోయినా, తెలుగు దేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ప్రకటించింది. ఆ మద్దతు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయానికి కీలకంగా మారింది.
ప్రజా సమస్యలపై జనసేన ఉద్యమాలు…
2017లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తీవ్రంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సమస్యను జనసేన పార్టీ బలంగా ప్రస్తావించింది.
2018లో బలవంతపు భూసేకరణ, రిజర్వ్ అడవుల్లో అక్రమ మైనింగ్, కరువు వంటి అంశాలపై పార్టీ నిరసనలు చేపట్టింది.
2019 ఎన్నికలు – తొలి పరీక్ష…
2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారి పోటీ చేసి ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. సుమారు 6 శాతం ఓట్లను సాధించింది. ఆ తర్వాత రైతు సంక్షేమం, మహిళల భద్రత, అక్రమ ఇసుక తవ్వకం, భూ ఆక్రమణ వంటి సమస్యలపై పార్టీ దృష్టి సారించింది.
నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. అలాగే కర్నూలులో జరిగిన సుగాలి ప్రీతి ఘటనపై న్యాయం కోరుతూ ర్యాలీ నిర్వహించి సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ కు డిమాండ్ చేశారు.
“జనవాణి” కార్యక్రమం…
2022లో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు పవన్ కళ్యాణ్ “జనవాణి” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రజలు తమ సమస్యలను పార్టీ నాయకత్వానికి నేరుగా తెలియజేసే అవకాశం కల్పించారు.
2023లో వారాహి యాత్ర…
2023లో పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనంపై పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు.
2024 ఎన్నికలు – చరిత్రాత్మక విజయం….
2024 ఎన్నికల ముందు జనసేన, టిడిపి, బిజెపి కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన అన్ని 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ప్రభుత్వంలో కీలక పాత్ర….
2024 జూన్ 12న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ & టెక్నాలజీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అలాగే జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ఆ హార మరియు పౌర సరఫరాల మంత్రిగా, కందుల దుర్గేష్ప ర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఉద్యమ పార్టీ నుంచి అధికార భాగస్వామ్యం….
ఉద్యమ పార్టీగా ప్రారంభమైన జనసేన, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామ్యంగా నిలిచింది. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. 2014లో ప్రారంభమైన జనసేన ప్రస్థానం 2026 లో నేడు ఉద్యమి సభ్యత్వ నమోదుతో మరింత బలోపేతమై రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకొని… వీరాభిమానులు, వీర మహిళలు, జన సైనికులతో పవన్ ప్రభంజనం కొనసాగుతోంది.
ఎడిటర్