
మంత్రులకు సంకేతాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు
మార్చి 17 తో ముగియనున్న పురపాలక కాల పరిమితి
ఏప్రిల్ 12తో పంచాయతీలకు గడువు…
ప్రత్యేక అధికారులకు పాలనాపగ్గాలు…
బీసీ రిజర్వేషన్లు… నివేదిక వచ్చాకే ఎన్నికలు…?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై నెలలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇచ్చారు. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అందుకు మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని సూచించారు. సొల్లుత పంచాయతీ ఎన్నికలు తర్వాత మున్సిపాలిటీలు ఆ తదుపరి జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు మార్చి 17తో పాలకవర్గ గడువు ముగియనుంది. ఏప్రిల్ 12వ తేదీతో పంచాయతీలకు కూడా గడువు ముగుస్తుంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు అంతా మాజీలు కానున్నారు. స్థానిక సంస్థల నడిపించే బాధ్యత ప్రత్యేక అధికారులకు అప్పగించింది. పాలకవర్గాల గడువు ముగియగానే ప్రత్యేక అధికారులు స్థానిక సంస్థల్లో కీలక పాత్ర పోషించనున్నారు. నగరపాలక సంస్థలకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది ప్రభుత్వం. పురపాలక సంఘాలకు ఆర్డిఓ లను, పలు జాయింట్ కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యేలాగా ఎన్నికలు జరుగుతాయని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు ప్రకటించడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మరో 5, 6 నెలల తరువాత జరుగుతాయని స్పష్టత వచ్చినట్లయితే.
ఓటరు సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకోగా బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందం ఉంది. నివేదిక ఆధారంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పు అంశం పై ప్రభుత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం దృష్టి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అయ్యా రిజర్వేషన్లు అమలు చేయాలి అంటే నివేదికలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి అయ్యా బిల్లులు అసెంబ్లీలో మండలిలో చర్చించి ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని పదవీకాలం మార్చి 31 తో ముగియనుంది. ఇప్పటికే నూతన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్స్ చేయగా ఏప్రిల్ నెలలో నూతన ఎన్నికల కమిషన్ నియామకం జరగనుంది. ఈ కారణాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరికొన్ని హామీలను అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించడంతో జూలై- ఆగస్టు నెలల్లో ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు ప్రభుత్వం వ్యూహం రచించినట్లు సమాచారం.
తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా నూతన పెన్షన్ల మంజూరు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఈ రెండు అంశాలతో పాటు ఇళ్ల స్థలాల పంపిణీ పై ప్రజల నుంచి డిమాండ్ బాగా వినిపిస్తోంది. ఈ మూడు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఉగాది రోజున నూతన పెన్షన్ లపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. మహిళలకు ప్రతినెల 1500 ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పడే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కొంత కాలయాపన జరగవచ్చు. రానున్న రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రివర్గ సమావేశం, కలెక్టర్ల సదస్సులో చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ చేసే అవకాశం లేదనే స్పష్టం అవుతుంది. పాఠశాలలు పున ప్రారంభమయ్యాక తల్లికి వందనం పథకం నగదు జమ చేసి ఎన్నికలకు వెళితే కొంత మేలు జరుగుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.