
అవును మీరు విన్నది నిజమే. ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో లేదు కదా. ప్రజారాజ్యం పార్టీ జెండా కోసం గొడవ పడడం ఏంటి అనుకుంటున్నారా. ముమ్మాటికి నిజం… నిజంగా ప్రజారాజ్యం పార్టీ జెండా దిమ్మె కోసం జనసేన పార్టీ, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. మచిలీపట్నం లోని నాయుడుపేట లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి పక్కన వీధిలో గల జెండా దిమ్మె వ్యవహారం వివాదానికి కారణమైంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జండా దిమ్మె ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు భావించారు. పవన్ కళ్యాణ్ అన్నగారు, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండా దశబ్దం క్రితం ఏర్పాటు చేశారని.. ఇప్పుడు ఆ జెండా స్థానంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరిస్తామని సిమెంట్ దిమ్మె ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు జనసేన నాయకులు. సరిగ్గా ఇదే సమయంలో అది ప్రజారాజ్యం పార్టీ జెండా కాదు… కాంగ్రెస్ పార్టీ జెండా అని, అక్కడ జనసేన పార్టీ జెండా ఏర్పాటు చేయడానికి వీలులేదని వైసీపీ నాయకులు కార్యకర్తలు వాదించారు. రాత్రి సమయంలో పోలీసుల సమక్షంలోనే జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా జండా ఎలా ఏర్పాటు చేస్తారని వైసీపీ నాయకులు ప్రశ్నించారు.
దీంతో జనసేన -వైసీపీ నాయకులు కార్యకర్త మధ్య వాదన తోపులాటలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనలో పేర్ని నాని అనుచరుడు బుర్ర విటల్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వైసిపి నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పేర్ని కిట్టు తో కలిసి వైసిపి నాయకులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

మాజీ మంత్రి పేరుని నాని ఏకంగా స్టేషన్కు వెళ్లి తన అనుచరుని విడిపించాలని ఏ కారణంతో అరెస్టు చేస్తారని నిలదీశారు. తన అనుచరుని విడిపించుకుని పేర్ని నాని పంతం నెగ్గించుకున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ మచిలీపట్నంలో సెక్షన్ 30 అమలు చేస్తోంది పోలీస్ పహారా కొనసాగుతున్నప్పటికీ జనసేన వైసిపి నాయకులు మాత్రమే ఎక్కడ తగ్గడం లేదు. ఈ ఘటన చిలికి చిలికి గాలి వానలో మరి జిల్లా సరిహద్దులు దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చిని అంశంగా మారింది. తన కార్యకర్త తన ఇంటికి వస్తే మీకేంటి అంటూ పోలీసులపై రెచ్చిపోయారు పేర్ని నాని. ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుతం మనుగుడిలో లేకపోయినా జెండా దిమ్మె కోసం జనసేన గట్టిగానే ప్రయత్నిస్తోంది. జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ కూడా రాజకీయ దుమారాన్ని లేపింది. చివరికి జెండా దిమ్మె వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.