
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన నేతల్లో ఆమంచి కృష్ణమోహన్ ఒకరు. ముఖ్యంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆయన పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. స్థానిక స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన ఆమంచి, ప్రజల మధ్య తిరిగే నాయకుడిగా తనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
రాజకీయాల్లో ప్రవేశం.
అమంచి కృష్ణమోహన్ మొదటగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో ఎదిగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఆయన స్థానిక స్థాయిలో బలమైన నాయకుడిగా ఎదిగారు.
2014లో ఇండిపెండెంట్‌గా సంచలన విజయం..
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో అమంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పెద్ద పార్టీల అభ్యర్థులను ఎదుర్కొని స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం పెద్ద సంచలనంగా మారింది. ఈ విజయంతో ఆయన వ్యక్తిగత ప్రజాదరణ ఎంత ఉందో స్పష్టమైంది.
టీడీపీలో చేరిక…
2014 తర్వాత అమంచి కృష్ణమోహన్ తెలుగు దేశం పార్టీ లో చేరారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీతో కలిసి పనిచేశారు. అయితే కొంతకాలానికే రాజకీయ సమీకరణాలు మారడంతో పార్టీకి దూరమయ్యారు.
వైసీపీలో చేరిక…
2019 ఎన్నికలకు ముందు అమంచి కృష్ణమోహన్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వైసీపీ తరఫున చిరాల నుంచి పోటీ చేసినప్పటికీ ఈసారి ఆయనకు విజయం దక్కలేదు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో కూడా చీరాల రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ పేరు కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. రాజకీయ పరిస్థితులు ఎలా మారినా చీరాల రాజకీయాల్లో ఆమంచి ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆమంచి.. వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా …
ఇటీవల అమంచి కృష్ణమోహన్ కార్యకలాపాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. స్థానికంగా కార్యకర్తలతో సమావేశాలు, ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలు పెరిగాయి. దీంతో ఆయన మళ్లీ వైసీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన అనుభవం ఉండటంతో పార్టీతో ఆయనకు సంబంధాలు పూర్తిగా తెగలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కరణం వెంకటేష్ పరిస్థితి ఏంటి..?
చిరాల నియోజకవర్గంలో ప్రస్తుతం కరణం వెంకటేష్రా జకీయ భవిష్యత్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన తండ్రి మాజీ మంత్రి కరణం బలరాం ఈ ప్రాంతంలో ఒకప్పుడు బలమైన నేతగా ఉన్నారు. కానీ రాజకీయ సమీకరణాలు మారడంతో చిరాలలో నాయకత్వ పోటీ పెరిగింది.
అమంచి మళ్లీ వైసీపీలోకి వస్తే కరణం వెంకటేష్ పాత్ర ఏమవుతుంది అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉంటే స్థానికంగా గ్రూప్ రాజకీయాలు పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
జగన్ స్ట్రాటజీ ఏమిటి..?
వైసీపీ అధినేత వై . ఎస్ . జగన్మో హన్ రెడ్డి రాజకీయంగా బలమైన నాయకులను తన పార్టీలోకి తీసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. చిరాల వంటి కీలక నియోజకవర్గంలో బలమైన స్థానిక నేత అవసరం ఉందని పార్టీ భావిస్తే అమంచి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే కరణం కుటుంబాన్ని ఎలా సమన్వయం చేస్తారు..? ఇద్దరు వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? అన్నది జగన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
- చీరాల రాజకీయాలు మళ్లీ హాట్…
అమంచి తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం మొదలైనప్పటి నుంచి చిరాల రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీల్లోనూ వ్యూహాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.