
బాషా భయపడతాడా..?
రజనీపై ఆరోపణలు నిజమేనా..?
రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు..?
రానున్న ఎన్నికల్లో మద్దతు ఎవరికీ..?
భాష ఒక్కసారి చెప్పి 100 సార్లు చెప్పినట్టు అని రజనీకాంత్ డైలాగ్ చెప్తే అభిమానులు ఉధృతలోకి పోతారు. రజనీకాంత్ ని దైవంగా భావిస్తారు ఆయన అభిమానులు. దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు అభిమానులను సొంతం చేసుకున్న ఘనత రజనీకాంత్ కి సొంతం. అత్యంత సామాన్యుడు నుంచి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన రజనీకాంత్ జీవితంలో ఎన్నో దశలను చూశారు. సాధారణ వ్యక్తిగా జీవించేందుకు రజనీకాంత్ ఇష్టపడతారు అన్నది దేశ యావత్ ప్రజలకు తెలియనిది కాదు.
రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉన్నప్పటికీ…
రాజకీయాల్లోకి వస్తున్నాను రజనీకాంత్ ప్రకటించినప్పటికీ అది జరగలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ముందుకు రాలేదన్నది అత్యంత సన్నిహిత వ్యక్తుల అభిప్రాయం.
తమిళనాడు ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు వేడెక్కాయి.
పనిలో పనిగా సినీ నటుడు తలైవా.. రజనీకాంత్ ను కూడా రాజకీయాల్లోకి లాగేసారు. టీవీ కేకు చెందిన అధో అర్జున్ చేసిన విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చిని అంశం అయ్యాయి.
స్వయంగా తలైవా కూడా ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం వచ్చింది.
రజనీకాంత్ ఉద్దేశించి పివికే నాయకుడు చేసిన విమర్శ ఏమిటంటే… రజనీకాంత్ కి రాజకీయాల్లోకి రావాలని ఉన్నప్పటికీ డీఎంకేకి భయపడి రాజకీయాల్లోకి రావడం లేదని.. డీఎంకే రజనీకాంత్ ను బెదిరించిందని టీవీకే నేత ఆరోపించారు.
ఈ వాక్యాలు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనా రేకెత్తించాయి.
దీనిపై రజినీకాంత్ అభిమానులు టీవీకి మధ్య పరస్పర విమర్శలు నడుస్తున్నాయి.
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలు, భాష, అభిప్రాయాలు ఎప్పుడూ చర్చలోనే ఉంటాయి. తాజాగా మరోసారి ఆయన పేరు చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి.
బాషా భయపడతాడా..?
రజనీకాంత్ భాషకు భయపడతాడనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా తమిళం, హిందీ అంశాలపై ఆయన జాగ్రత్తగా స్పందించడం వల్ల ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం దీన్ని భయం కాదు, సమతుల్యంగా మాట్లాడే ప్రయత్నంగా చూస్తున్నారు.
ఆరోపణలు నిజమేనా..?
సినీ, సామాజిక అంశాలపై రజనీ మాట్లాడిన ప్రతి మాట రాజకీయంగా విశ్లేషించబడుతోంది. కొన్ని వర్గాలు ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తే, మరికొన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఆరోపణలు పూర్తిగా నిజమని చెప్పడం కష్టం—అవి రాజకీయ కోణంలో పెంచి చూపుతున్న అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు..?
ఒక దశలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి, తరువాత ఆరోగ్య కారణాలు మరియు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గారు. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం సాధ్యం కాదని ఆయన స్వయంగా చెప్పారు.
రానున్న ఎన్నికల్లో మద్దతు ఎవరికీ..?
ఇప్పటివరకు రజనీకాంత్ స్పష్టంగా ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. సాధారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత అభిప్రాయాలకే పరిమితం అవుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో పరిస్థితుల్ని బట్టి పరోక్షంగా ఎవరికైనా మద్దతు తెలపవచ్చన్న అంచనాలు మాత్రం కొనసాగుతున్నాయి.
తనంతట తానుగా స్పందించిన తలైవా…
పీవీకే నాయకుడు చేసిన విమర్శలపై రజనీకాంత్ స్పందిస్తూ తనపై వచ్చిన వ్యాఖ్యలను రజనీకాంత్ తిప్పికొట్టారు. అందులో వాస్తవం లేదని అభిమానుల సంయమనం పాటించాలని కోరారు. తన కొండగా నిలిచిన అభిమానులు నాయకులు కార్యకర్తలు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రజనీకాంత్ పేరు రాజకీయాల్లో వినిపించడం కొత్తేమీ కాదు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. అందుకే రానున్న ఎన్నికల్లో ఆయన పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.