
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు మొదలైంది. ఒకప్పుడు ఒకే పార్టీ లో కలిసి పనిచేసిన గురు-శిష్యులు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎదురెదురుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ఆమె శిష్యుడిగా గుర్తింపు పొందిన సువేందు అధికారి మధ్య రాజకీయ పోటీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదిగిన సువేందు అధికారి, మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవారు. నందిగ్రామ్ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర పార్టీకి ఎంతో బలం చేకూర్చింది. అయితే తరువాత రాజకీయ విభేదాల కారణంగా సువేందు బీజేపీలో చేరి, తన గురువుకే సవాల్ విసిరారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో గురు-శిష్యుల మధ్య జరిగిన పోటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఎన్నికల్లో సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో మమతా బెనర్జీపై విజయం సాధించడం పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య రాజకీయ పోరు తగ్గలేదు.
ప్రస్తుతం కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ గురు-శిష్యుల పోటీ కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే ప్రతి అంశంలోనూ ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ, తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భవాని పూర్ లో పోటీకి సై….
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ తన బలమైన నియోజకవర్గమైన భవానిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతుండగా, ఆమెకు ప్రత్యక్ష సవాల్‌గా ప్రతిపక్ష నాయకుడు సువేండు అధికారి ను భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపింది.
ఈ పోటీ సాధారణ ఎన్నికల పోటీ కాదు. ఇది ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య ప్రతిష్టాత్మక సమరం. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి, ఇప్పుడు ఆమెకు అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థిగా మారడం ఈ పోటీకి మరింత రసాన్ని తెచ్చింది.
సువేందు అధికారి ఎవరు?
సువేందు అధికారి రాజకీయంగా త్రినమూల్ కాంగ్రెస్‌లో ఎదిగి, నందిగ్రామ్ ఉద్యమంతో ప్రజల్లో బలమైన గుర్తింపు పొందారు. తరువాత పార్టీ మారి భారతీయ జనతా పార్టీ లో చేరి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ప్రభావం బీజేపీకి పెద్ద ఆస్తిగా మారింది.
హోం టర్ఫ్ vs హోం టర్ఫ్….
ఈసారి సన్నివేశం పూర్తిగా మారింది. నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు, ఇప్పుడు ఆమె స్వంత కోట అయిన భవాని పూర్లో పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో “హోం టర్ఫ్ vs హోం టర్ఫ్” పోటీగా ఇది మారింది.
బీజేపీ ఎత్తులు..
బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, మమతను నేరుగా టార్గెట్ చేస్తోంది. సువేందు అధికారి వంటి బలమైన నాయకుడిని బరిలోకి దింపడం ద్వారా “మమతకు ఎక్కడా సేఫ్ జోన్ లేదు” అనే సందేశాన్ని ఇవ్వాలని చూస్తోంది. అభివృద్ధి, కేంద్ర పథకాలు, హిందుత్వ అజెండాతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
మమత వ్యూహాలు…
మరోవైపు మమత బెనర్జీ బెంగాల్ అస్మిత, స్థానిక భావోద్వేగాలు, మహిళల సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. బౌనిపోర్లో తన బలమైన ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటూ, సువేందుకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు.
వ్యక్తిగతం నుంచి సిద్ధాంతాల దాకా…
మమత vs సువేందు పోటీ కేవలం రాజకీయ పోటీ కాదు. ఇది వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఆధిపత్యం, సిద్ధాంతాల మధ్య యుద్ధంగా మారింది. ఒకప్పుడు గురు-శిష్యుల్లా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా తలపడటం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్‌గా మారింది.
ఎవరి విజయం…?

ఈ పోటీ ఫలితం పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. మమత తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా? లేక సువేందు అధికారి బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.