నవోదయ ఫలితాల్లో శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ సత్తా
ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించిన ప్రకుల్పాల్
వినుకొండలో భారీ విజయోత్సవ ర్యాలీ

వినుకొండ : జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా మొదటి తొమ్మిదవ ర్యాంకుతో పాటు మొత్తం 10 సీట్లు సాధించడం విశేషం. ఈ విజయంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయాన్ని సాధించాయని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ ర్యాలీ విజేత హై స్కూల్ నుండి ప్రారంభమై వినుకొండ పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కావూరి సాయికుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య మాట్లాడుతూ గత ఏడాది ఆరు సీట్లు సాధించిన శ్రీ విజయత హై స్కూల్ ఈ ఏడాది నవోదయలో 10 సీట్లు సాధించడంతోపాటు ఆల్ ఇండియా మొదటి ర్యాంకు కైవసం చేసుకుని పల్నాడు జిల్లా అని రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిందని చెప్పారు. తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు పల్నాడు జిల్లాకు గర్వకారణం అన్నారు. తమ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఆల్ ఇండియా స్థాయిలో నవోదయ పరీక్షల్లో ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

