తెలుగునాట కొత్త ఏడాది ప్రారంభమైంది. తాడేపల్లిలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉగాది వేడుకలు నిర్వహించి, పంచాంగం ఆలకించారు. ఇక విజయవాడలో నిర్వహించిన అధికారిక ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇరువురి
ముఖ్య నేతలు తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో, భవిష్యత్ ఎలా ఉంటుందో వేద వండితులు చెప్పగా అలకించారు. వేదవండితులు ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన కుర్రోడిలా కనిపించగా, గతంలో ఎన్నడూ లేని ధీమా జగన్ లో ఉగాది సందర్భంగా కనిపించింది. ఎవరి నమ్మకం, ఎవరి ఆలోచన, ఎవరి వ్యూహాలు వారివి. అయితే ఈ పరాభవనామ నూతన సంవత్సరాది ఉగాది మాత్రం ఇరువురు కీలక
నేతలకు, వారి మిత్రపక్షాలు, సొంత కేడరు ఎంతో కీలకమైన సంవత్సరం. ఈ ఏడాది మరో ఐదారు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇరు పార్టీలకు ఇది ఎంతో కీలకం కానుంది.
కూటమి వ్యతిరేఖతపై జగన్ ఆశలు…
జగన్ ఓ వైపు కూటమి ప్రభుత్వంపై రెండేళ్ళకే వ్యతిరేఖత భారీగా వచ్చిందని జగన్ బహిరంగంగా చెప్పటమేకాక కొత్త లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని, ఇప్పటికే ప్రజల్లో, మహిళలు, రైతులు, నిరుద్యోగుల్లో వ్యతిరేఖ ప్రారంభమైందని అంచనావేస్తున్నారు జగన్. కూటమి ప్రముఖంగా ఇచ్చిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500/-ల ఆర్థిక సాయం, నూతన పెంఛన్లు, నిరుద్యోగ భృతి వంటికి ఎందుకు అమలు చేయలేకపోయారని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్ల ఇప్పటికే ప్రజల అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు
జగన్. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేఖత మరింత పెరుగుతుందని, దానికి తోడు తాను కూడా పాదయాత్ర చేపట్టి సుమారు ఏడాదిన్నరపాటు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు జగన్ వెళ్లడించి భవిష్యత్ వ్యూహ రచనపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపటంతోపాటు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్. ఈ ఏడాది సభ్యత్వ నమోదు ద్వారా 18 లక్షల మందిని పార్టీ సైన్యంగా తయారు చేసుకొని రానున్న రోజుల్లో బూత్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి వరకూ – పార్టీ ఏ పిలుపు ఇచ్చినా విజయవంతంగా అమలయ్యేలా ప్రణాళికలు చేస్తోంది వైసీపీ అధిష్ఠానం. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం… ఈ సారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకే ప్రధమ ప్రాధాన్యత ఇస్తాను అంటూ జగన్ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ తరువాత వైసీపీ కొంత యాక్టివ్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్న కూటమి…..
ఇదిలా ఉంటే జగన్ పార్టీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని, తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని సూవర్ సిక్స్ పధకాలు సూపర్ హిట్ అయ్యాయని, ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమికి కలిసొస్తుందని, పింఛన్లు ఒకేసారి రూ.3వేల నుండి రూ.4వేలకు పెంచటమేకాక, ప్రతినెలా 1వ తేదీనే అందజేస్తున్నామని, అన్న దాత సుఖీభవ అమలు చేశామని, తల్లికి వందనం ద్వారా ప్రతి ఇంటిలో ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున సాయం అందించామని, విద్యారంగంలో నారా లోకేష్ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని, మెగా డిఎస్సీద్వారా 16వేల ఉద్యోగాలు కల్పించామని, తాజాగా అన్నదాత సుఖీభవ విడుదల చేశామని, దివ్యాంగ శక్తి వధకం ప్రారంభించటంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల తమకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిందని కూటమి భావిస్తోంది. వీటితోపాటు అప్పుల భారం ఉన్నప్పటికీ ఓ వైపు, అభివృద్ధి మరోవైపు సంక్షమే పధకాలను ప్రజలకు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, ఈ
అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం ద్వారా ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలియజేయాలని, వివేకానందరెడ్డి హత్య విషయాన్ని కూడా ప్రజలకు వదేవదే గుర్తు చేస్తోంది కూటమి. జగన్ ఆలోచనలు వసిగట్టి గత ఎన్నికల్లో వ్యూహాత్మక పొత్తులో ఘోరంగా ఓడించిన అనుభవాన్ని మరోమారు ప్రయోగించి ఓ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేసి ఆర్యవైశ్యులు పూర్తిగా తమకు అండగా ఉంటారని కూటమి లెక్కలేస్తోంది. ఇక టీటీడీ లడ్డు వ్యవహారం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, జనసేన, టీడీపీ, బీజేపీలకు హిందువులు అధికశాతం అండగా నిలుస్తారని కూటమి ధీమాతో ఉంది. వలువురు మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా వివాదాల్లో చిక్కుకోవటం కూటమికి కొంత మచ్చతెచ్చినట్లయిందన్నది రాజకీయవర్గాల్లో నడుస్తున్న చర్చ.
స్థానిక సమరంలో విజేతలెవరో…
సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు సాధించిన కూటమి పార్టీలు ఐక్యంగా ముందుకు సాగి వైసీపీని మరోమారు గ్రామస్థాయిలో దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల గడువు పూర్తవుతున్నా ఎన్నికలు జరిపేందుకు కొంత జావ్యం చేస్తోంది. ఈ అవకాశం ద్వారా మరికొన్ని పథకాలు అమలు చేయటంతోపాటు, తాము ఇచ్చిన ప్రతి ఒక్క వధకాన్ని ప్రజలకు తెలిసేలా చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గతంలో వైసీపీ తరపున గెలుపొందిన సర్పంచ్లు, ఎంపీపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఛైర్మన్లతోపాటు మూడు పార్టీలకు చెందిన నాయకులను ఐక్యంగా ఉండేలా చూసి క్లీన్ స్వీప్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన పార్టీని ఓటు బ్యాంకు తగ్గలేదన్న భరోసాతో స్థానిక నాయకుల్లో ఉత్సాహం నింపి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేఖను తమకు అనుకూలంగా మలచుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని అధిక స్థానాలు గెలవటం ద్వారా వైసీపీకి పూర్వ వైభవం తేవాలని జగన్ భావిస్తున్నారు. గతానికి భిన్నంగా తరచూ మీడియా సమావేశాలు, నాయకులుతో సమీక్షలు
నిర్వహిస్తున్నారు. మరి ఈ శ్రీ వరాభవ నామ సంవత్సరంలో విజేతలుగా ఎవరు నిలుస్తారో, ఎవరు పరాభవం చెందుతారో వేచి చూద్దాం.