
నారా దేవాన్స్ సెలబ్రేషన్…
చంద్రబాబు నాయుడుడి డికేషన్…!
ఎవరైనా తమ మనవడి పుట్టినరోజు వేడుకల కోసం తిరుమల వంటి పుణ్యక్షేత్రానికి వెళ్తే, ఆ రోజంతా కుటుంబంతో గడుపుతూ ప్రశాంతతను కోరుకుంటారు. కానీ, అక్కడ ఉన్నది సాదాసీదా వ్యక్తి కాదు.. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్, ‘సూపర్ అడ్మినిస్ట్రేటర్’ గా పేరుగాంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఒకవైపు మనవడి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నా, మరోవైపు ఆయనలోని ‘వర్కహోలిక్’ నాయకుడు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు.
వేడుక కోసం వెళ్ళినా.. ‘మిషన్ మోడ్’ లోనే సీఎం!
ప్రతి భక్తుడిలాగే ముఖ్యమంత్రి కూడా మనశ్శాంతి కోసమే శ్రీవారి చెంతకు చేరారు. అయితే, ఆ ప్రశాంతత కేవలం తనకే కాదు, తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అందాలనేది ఆయన తపన. అందుకే ‘ఫ్యామిలీ టైమ్’ ను కూడా ‘పబ్లిక్ సర్వీస్’ గా మార్చేశారు.
టెక్నాలజీతో అపవిత్రతకు చెక్….
లడ్డూ ప్రసాదం విషయంలో గతంలో తలెత్తిన వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ‘ఈ-టంగ్’, ‘ఈ-నోస్’ వంటి సెన్సార్లతో ప్రసాదాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో విశ్లేషించడం ద్వారా.. కల్తీకి ఇక తావులేదని భక్తులకు భరోసా ఇచ్చారు.
AI తో స్మార్ట్ క్యూ మేనేజ్మెంట్…
భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని ముందే అంచనా వేసే వ్యవస్థను పటిష్టం చేశారు.
అడ్మినిస్ట్రేటర్ ‘బాబు’ మార్క్ డెడికేషన్
కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డిస్తూ.. “లడ్డూ రుచి ఎలా ఉంది? వసతులు బాగున్నాయా?” అని ఆరా తీయడం చంద్రబాబు నాయుడు గారి డెడికేషన్‌కు నిదర్శనం. అధికారుల ఫైళ్ల కంటే, సామాన్య భక్తుడి నోటి నుంచి వచ్చే మాటే నిజమైన ‘రిపోర్ట్’ అని ఆయన నమ్ముతారు. అందుకే మనవడి పుట్టినరోజున కూడా ఆయన విశ్రాంతి లేకుండా సమీక్షలు నిర్వహించి, తిరుమల పవిత్రతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు గారి ఈ పర్యటన ద్వారా పర్సనల్ లైఫ్ కంటే పబ్లిక్ లైఫ్ కే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మరోసారి నిరూపితమైంది. “దేవాన్ష్ పుట్టినరోజు వేడుక – భక్తుల సౌకర్యాల వేట”.. ఈ రెండింటినీ మేళవించి ఆయన చేసిన తిరుమల పర్యటన అటు భక్తుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టెక్నాలజీని వాడి ఆధ్యాత్మికతను కాపాడటంలో ‘బాబు’ మార్క్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతమని చెప్పక తప్పదు.
