కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో ప్రత్యేక గుర్తింపు మరియు సముచిత స్థానం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధీమా వ్యక్తం చేశారు.
వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పురపాలక సంఘం పాలకవర్గ పదవీకాలం ముగిసిన సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను, వారి కుటుంబ సభ్యులను బొల్లా బ్రహ్మనాయుడు ఘనంగా సత్కరించారు. పార్టీ పరిశీలకులు బాసులింగారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నిజమైన కార్యకర్తలే మా కుటుంబం….
పార్టీ సింబల్‌పై గెలిచి, అధికారం మారగానే ఫిరాయించిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తల్లిలాంటి పార్టీని నమ్ముకుని ఉన్న 18 మంది కౌన్సిలర్లను మా కుటుంబ సభ్యుల్లా భావిస్తాం. వారికి అన్ని విధాలా అండగా ఉంటాం” అని బొల్లా భరోసా ఇచ్చారు.
అభివృద్ధి శూన్యం – శిలాఫలకాల మార్పే ధ్యేయం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే పట్టణంలో కనిపిస్తోందని, ప్రస్తుత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కేవలం పాత పనులకు శిలాఫలకాలు మార్చడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమని బొల్లా ఎద్దేవా చేశారు.
రైతుల సమస్యలపై గళం….
హార్టికల్చర్ హబ్ అని గొప్పలు చెప్పే ఎమ్మెల్యే, ముందు రైతులు పండించిన పొగాకు, మొక్కజొన్న, కందులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
హామీల అమలు ఎక్కడ….?
“సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ? గతంలో మేము 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, 12 లక్షల ఇళ్లు నిర్మించాం. మరి ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ అయినా ఇచ్చిందా?” అని ప్రశ్నించారు.
కార్యకర్తలకు అభయం:బాసు లింగారెడ్డి
పార్టీ పరిశీలకులు బాసులింగారెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే వారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
సత్కారం పొందిన కౌన్సిలర్లు….

బత్తుల వీరమ్మ, నాగేశ్వరి, దేవళ అంజమ్మ, పాపసాని బ్రహ్మయ్య, బేతం గాబ్రియేలు, ఎస్కే దిల్షాద్, మురికిపూడి జయరాజు, సానాల పుల్లయ్య, రిహానా సుల్తానా, ఎం. ఎస్. కె. భాష చేపల మడుగు సైదా, ఎస్కే గౌస్ బాషా, తెల్లాకుల రాజేష్ కన్నా, బత్తుల పద్మ, పఠాన్ మల్లికాబేగం, మునగాల లక్ష్మిరెడ్డి, పిడతల దేవదాసు తదితరులను నూతన వస్త్రాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.