బోడె రామ చంద్ర యాదవ్. ఇది ఒక పేరు కాదు. ఇది ఉద్యమ మార్గం. ఆరాటానికి పోరాడటం నేర్పే గళం. బీసీల ఐకమత్యం, బీసీల ఆత్మగౌరవం, బీసీల భవిష్యత్… మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడు.
బీసీ లంటే ఓట్లు వేసే యంత్రాలు కాదు…
మీ పార్టీల జెండాలు మోసే బానిసలూ కాదు…
రాజ్యాధికారం సాధించే యోధులు అని నమ్మిన వ్యక్తి బోడె రామ చంద్ర యాదవ్.
ఆయన మాటలు తుటాలు గా…
ఆయన ఆలోచనలు భవిష్యత్ కి భరోసాగా
ఆయన ఉద్యమాలు బీసీలకి కొత్త ఊపిరిగా…
బీసీల కోసం సై అంటూ వచ్చిన బీసీ వై నాయకత్వం…
మరో అద్భుత ఆలోచన… బీసీల హక్కుల సాధనలో చరిత్రక మైలు రాయి గా నిలవాబోతోంది..
“బీసీ ధర్మ దీక్ష “….
బీసీల హక్కుల సాధనకే “ధర్మ దీక్ష” – ఏప్రిల్ 11 నుంచి బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల హక్కుల అంశం మరోసారి వేడెక్కుతోంది. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత బోడె రామచంద్ర యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 11వ తేదీ నుంచి “బీసీ ధర్మ దీక్ష” పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం “పూలే-మండల్ భవన్” వేదికగా ఈ దీక్ష జరగనుంది.
ఇటీవల నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై మార్చి 31 వరకు గడువు విధించినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఈ దీక్షకు ప్రధాన కారణంగా మారింది. ప్రభుత్వ వైఖరిని “నిశ్శబ్ద నిర్లక్ష్యం”గా అభివర్ణించిన బీసీవై పార్టీ, ఇక మాటలతో కాదు – ప్రత్యక్ష పోరాటంతోనే హక్కులు సాధించాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది.
బోడె రామచంద్ర యాదవ్ ఈ దీక్షను కేవలం రాజకీయ కార్యక్రమంగా కాకుండా, బీసీల ఆత్మగౌరవ పోరాటంగా మలచాలని సంకల్పించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న అన్యాయం, అవకాశాల లోపం, సామాజిక వెనుకబాటుతనంపై పోరాడేందుకు ఇది చారిత్రాత్మక ఘట్టమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. “మాట తప్పిన ప్రభుత్వం – మడమ తిప్పని నాయకత్వం” అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని యోచిస్తున్నారు.
బీసీవై పార్టీ ప్రధాన డిమాండ్లు
ఈ ధర్మ దీక్ష ద్వారా ప్రభుత్వం ముందుంచిన ఐదు కీలక డిమాండ్లు బీసీల భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్నారు…
బీసీ రక్షణ చట్టం: బీసీలపై జరుగుతున్న సామాజిక అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అమలు
అమరావతిలో భూమి కేటాయింపు: బీసీల ఆత్మగౌరవ భవనాలు, సంస్థల కోసం 1000 ఎకరాలు
సమగ్ర కులగణన: శాస్త్రీయ విధానంలో కులగణన చేసి నిజమైన జనాభా వివరాల సేకరణ
44% రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
బీసీ కార్పొరేషన్లకు నిధులు: స్వయం ఉపాధి అవకాశాల కోసం తక్షణ ఆర్థిక సహాయం
ఈ డిమాండ్లు అమలు అయితే బీసీల జీవన ప్రమాణాలు మారుతాయని, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర మరింత బలపడుతుందని పార్టీ విశ్వసిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మద్దతు పెరుగుతుందా?
ఈ “బీసీ ధర్మ దీక్ష” రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే అవకాశం ఉంది. బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, మేధావులు ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో బీసీలలో పెరుగుతున్న అసంతృప్తి ఈ ఉద్యమానికి బలం చేకూర్చే అవకాశముంది.
ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, ఈ దీక్ష మరింత పెద్ద ఉద్యమంగా మారి రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.