జనసేనకు అంతర్గత షాక్‌లు…
ఎమ్మెల్యేల వివాదాలు… పవన్‌కు పెను సవాల్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలక దశలోకి ప్రవేశించింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ఎన్నికల్లో ప్రభావం చూపాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నప్పటికీ, అంతర్గత పరిణామాలు ఆయన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
ఇటీవల పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వరుసగా వస్తున్న వివాదాలు జనసేనకు పెద్ద షాక్‌గా మారాయి. ముఖ్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమధవి పై వెలుగులోకి వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలు రాజకీయంగా భారీ దుమారం రేపుతున్నాయి. ఆమెకు చెందిన మీరకల్ సాఫ్ట్వేర్ సిస్టంస్ సంస్థ ద్వారా ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు మళ్లింపులు జరిగాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ వ్యవహారానికి కీలక మలుపు తీసుకువచ్చింది అదే సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు. ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ అఫ్‌ఇండియా కు ఫిర్యాదు చేయడంతో కేసు మరింత సీరియస్ మలుపు తిప్పింది. సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాలను వినియోగించి, వారికి జీతాల రూపంలో అదనపు మొత్తాలు జమ చేసి, వాటిని తిరిగి నగదుగా మార్చి ఎన్నికల ఖర్చులకు వినియోగించారనేది ఆరోపణల సారాంశం.
ఇక ఈ కేసుపై ఎన్నికల సంఘం స్పందించడం, జిల్లా స్థాయిలో విచారణ ప్రారంభం కావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, అది కేవలం ఎమ్మెల్యే పదవికే కాకుండా, పార్టీ ప్రతిష్టకూ భారీ దెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో, ఇతర ఎమ్మెల్యేలపై కూడా మహిళలపై దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం జనసేనకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాలను ప్రతిపక్షాలు సమర్థంగా వినియోగించుకుంటూ, సోషల్ మీడియా వేదికగా జనసేనపై విమర్శల దాడిని పెంచుతున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మళ్లించాల్సిన సమయంలోనే, అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తనే ప్రధాన చర్చగా మారడం పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇది అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక పార్టీ క్యాడర్లో కూడా ఈ పరిణామాలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరున్న పవన్ కళ్యాణ్, తన పార్టీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ వివాదాలను సమర్థంగా పరిష్కరించి, ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు అత్యంత కీలక పరీక్షగా మారింది. పార్టీ అంతర్గతంగా సీరియస్ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితిని సమయానికి అదుపులోకి తీసుకురాకపోతే, స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులు ఈ వివాదాలను ప్రధాన ప్రచార ఆయుధంగా మలచుకునే ప్రమాదం పొంచి ఉంది.