
నాన్ దా సింగిల్… అంటూ తమిళ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ కెరటం విజయ్ దళపతి. సినిమా హీరోగా తనకున్న క్రేజ్ ను ప్రజాసేవకు వినియోగించుకోవాలని టి వి కే ( తమిళ వెట్రి కళగం) పార్టీని స్థాపించిన విజయ్ కి బ్రహ్మ రథం పడుతున్నారు ఆ రాష్ట్ర ప్రజలు. కోట్లాదిమంది అభిమానులు ఉన్న విజయ్ సామాన్యుడిగా ఇతర రాజకీయ నాయకులు భిన్నంగా అడుగులు వేస్తున్నారు.

తమిళనాడు ఎన్నికల సమీపిస్తున్న వేళ టీవీ కె విజయ్ బిజెపితో జతకట్టి ఎన్నికలకు వెళతారని ఇటీవల జాతీయ అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. అయితే విజయ్ తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. విజయ్ ఒంటరి పోరికే మొగ్గు చూపుతాడని మన “పొలిటికల్ టెంపర్ ” ముందుగానే అంచనా వేసింది.
మీడియాలో పొత్తుపై వస్తున్న కథనాలను ఖండించిన విజయ్ దళపతి గతంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని ఒంటరిగా పోటీ చేసే అధికారాన్ని చేపడుతానని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయారంగే వ్యక్తం చేసిన తదుపరి ఆయన కుటుంబంలోనూ విభేదాలు తలెత్తి భార్య పిల్లలు కూడా విజయ్‌కి దూరమయ్యారని సమాచారం. కుటుంబంలో ఒంటరిగా ఉన్నా, కేసులు బెదిరింపులకు భయపడేది లేదని విజయ్ దళపతి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రాగానే సినీ నటితో సంబంధం పై బిజెపి పదేపదే విమర్శలు గుప్పించింది. ఓవైపు విజయ్ ని రాష్ట్రంలో వీక్ చేసేందుకు స్ట్రాటజీని అమలు చేస్తూనే మరోవైపు విజయ్‌తో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్లు వార్తలు వచ్చాయి.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని గమనించిన విజయ్ ఒడిన గెలిచిన సింగిల్‌గానే పోటీ చేస్తానని చెప్పటం వైసిపి అభిమానులు విజయం కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఏది ఏమైనా మరో కొద్ది రోజుల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికలు ఎలాంటి ఫలితాలు నమోదు అవుతాయో విజయ్భ వితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
విజయ్- పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయని పొత్తు కుదురుతుందని 45 నుండి 50 సీట్లు బిజెపి విజయకు ఆఫర్ చేసిందని వచ్చిన వార్తలను పొలిటికల్ టెంపర్ ఏకీభవించలేదు. రాష్ట్ర రాజకీయాలైనా దేశ రాజకీయాలైన సున్నిసితంగా గమనిస్తూ నాయకుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ సైతాంతిక విషయాలను పరిగణలోకి తీసుకొని నైతిక విలువలకు కట్టుబడి విలువైన రాజకీయ సమాచారాన్ని రాజకీయ అభిమానులకు అందించడానికి పొలిటికల్ టెంపర్ కట్టుబడి ఉంటుందని మనవి చేస్తున్నాను.
ఎడిటర్