బెంగాల్లో మోడీ వర్సెస్ దీదీ…
బీజేపీ దూకుడు, మమతకు భారీ సవాల్..
దేశ రాజకీయాల్లో మరో కీలక పోరు ప్రారంభమైంది. వెస్ట్బెం గాల్అ సెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పోటీ మరింత ఉత్కంఠగా మారుతోంది. బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించగా, అందులో వెస్ట్ బెంగాల్ ఉంది. ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ వేగంగా చర్యలు ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటన తర్వాతి రోజే బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రాజకీయ వేడి పెంచింది.
మొత్తం 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి ఏమిటీ షా , రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి నివేదికలు, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర పోటీ బాబానిపూర్ని యోజకవర్గంలో ఉండబోతోంది. ఇది సీఎం మమతా బెనర్జీ రాజకీయంగా బలమైన ప్రాంతంగా భావిస్తారు. అయితే ఈసారి ఆమెకు గట్టి సవాల్ విసరడానికి రాష్ట్ర ప్రతిపక్షనేత సువేండు అధికారి ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మరోవైపు బెంగాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని అల్ ఇండియా త్రు నమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రజల్లో మద్దతు పెంచుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మోడీ వర్సెస్ దీదీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు బెంగాల్లో మొదటిసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, మరోవైపు తన కట్టుదిట్టమైన కోటను కాపాడుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.